Kitchenvantalu

జంతికలు గుల్లగా, కరకరలాడుతూ రావాలంటే పిండిని ఇలా కలపండి!

Biyyam pindi janthikalu:జంతికలు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండిఇలా కలపండి..చాలా రుచిగా ఉంటాయి. సంక్రాంతి లేదా ఏ పండుగ వచ్చినా తెలుగువారి ఇంట్లో ముందుగా గుర్తుకు వచ్చే పిండి వంటకం జంతికలు (మురుకులు). అయితే చాలామందికి ఇవి గట్టిగా రావడం లేదా నూనె ఎక్కువగా పీల్చడం జరుగుతుంది. జంతికలు గుల్లగా, ఎంతో కరకరలాడుతూ రావాలంటే పిండిని కలిపే విధానంలో చిన్న మెళకువలు పాటిస్తే చాలు.

గుల్లనైన, రుచికరమైన జంతికలు పర్ఫెక్ట్‌గా రావడానికి ఏయే పదార్థాలు ఎంత మోతాదులో కలపాలి? పూర్తి రెసిపీ వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

కావలసిన పదార్ధాలు
బియ్యం – 250 gms
మినపప్పు – 50 gms
నూనె – 1 tbsp
ఉప్పు
వాము – 1 tbsp
నూనె – వేపుకోడానికి
నీళ్ళు – పిండి తడుపుకోడానికి

తయారీ విధానం
బియ్యం, మినపప్పు కలిపి మెత్తగా మర ఆడించి జల్లించిన పిండి తీసుకోండి.(మిక్సీ లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ కచ్చితంగా జల్లించాలి). ఇదే కేజీ కి చేసుకొంటే కేజీ బియ్యానికి 200 gms మినపప్పు, కప్పుల్లో అయితే కప్ బియ్యానికి అదే కప్ తో 5వ వంతు మినపప్పు వేయాలి.

ఈ పిండిలో ఉప్పు నూనె, నలిపిన వాము వేసి బాగా కలిపి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం సాఫ్ట్ గా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి.

జంతికల గిద్ద లో నూనె రాసి పెద్ద రంధ్రాలున్న ప్లేట్ పెట్టి, పిండి ముద్ద పెట్టి నూనె రాసిన ప్లేట్ మీద చిన్న చిన్న చుట్టలుగా వేసుకోండి, ఆ తరువాత వేడి నూనె లో వేసి మీడియం ఫ్లేం మీద మాత్రమే కరకరలాడేట్టు వేపుకోండి.చల్లారాక డబ్బా లో వేసుకోవాలి. ఇవి దాదాపుగా నెల రోజుల పాటు నిల్వ ఉంటాయి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."