Beauty Tips

జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరగాలా? ఈ గింజలను ఇలా వాడితే అద్భుతమైన ఫలితం!

Hair care Tips:వాతావరణ మార్పులు, కాలుష్యం మరియు సరైన పోషకాహారం లేకపోవడం వల్ల నేడు చాలామంది జుట్టు రాలే సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వాడే బదులు, మన వంటింట్లో లభించే కొన్ని ప్రత్యేక గింజలను ఉపయోగించడం ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు.

ఆ అద్భుతమైన గింజలు ఏంటి? వాటిని హెయిర్ కేర్‌లో ఎలా వాడాలి? పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి!

ఈ గింజ‌లు అందరికి తెలుసు.. వీటిని ఇలా ఉప‌యోగిస్తే జుట్టు వేగంగా పెరుగుతుంది.. జుట్టు రాలిపోవటం, తలలో దురద,చుండ్రు సమస్య ఇలా జుట్టుకి సంబందించిన అన్ని రకాల సమస్యలను తగ్గించటానికి గురివింద గింజ‌లు సహాయపడతాయి.

ఈ గింజలు పొలాల ద‌గ్గ‌ర‌, చేల కంచెల వెంబ‌డి విరివిరిగా ల‌భిస్తూ ఉంటారు. పల్లెటూర్లలో ఉండే వారికీ ఈ గింజల గురించి తెలుసు. అయితే ఇప్పుడు ఇవి online Stores మరియు ఆయుర్వేద షాపుల్లో కూడా విరివిగా లభ్యం అవుతున్నాయి.

గురివింద గింజ‌ల‌లో ఎన్నో ఔషద గుణాలు ఉన్నాయి. గురివింద గింజ‌ల‌ను మిక్సీ జార్ లో వేసి పప్పు వలె మిక్సీ చేసుకోవాలి. ఈ పప్పును ఒక మందపాటి వస్త్రంలో వేసి మూట కట్టాలి. త‌రువాత ఒక గిన్నెలో అర గ్లాస్ పాల‌ను తీసుకోవాలి. ఇందులో గురివింద గింజ‌ల మూట వేసి పాలు పూర్తిగా ఆవిరై పోయే వ‌ర‌కు మ‌రిగించాలి.

ఆ తర్వాత మూట‌ను తీసి ప‌క్కకు పెట్టాలి. మరొక గిన్నెలో 100 గ్రాముల కొబ్బరి నూనెను తీసుకోని ఒక స్పూన్ గుంట‌గ‌ల‌గ‌రాకు పొడిని వేసి క‌ల‌పాలి. ఆ తర్వాత ఉడికించిన గురివింద గింజ‌ల ప‌ప్పు కూడా వేసి క‌ల‌పాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి 5 నుంచి 7 నిమిషాల వరకు మరిగించి చల్లారబెట్టాలి. ఈ నూనెను వడకట్టి నిల్వ చేసుకోవాలి.

ఈ నూనెను రాత్రి పడుకొనే ముందు జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు పట్టించి మరుసటి రోజు ఉదయం తలస్నానం చేయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు రాల‌డం త‌గ్గుతుంది. జుట్టు ఒత్తుగా, న‌ల్ల‌గా పెరుగుతుంది. దుర‌ద‌, చుండ్రు వంటి స‌మ‌స్య‌లు దూర‌మ‌వుతాయి. ఈ చిట్కాను వారానికి రెండు సార్లు వాడ‌డం వ‌ల్ల మంచి ఫ‌లితం ఉంటుంది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."