ప్రెగ్నెన్సీ సమయంలో కాకరకాయ తింటున్నారా? ఈ నిజాలు తెలిస్తే షాక్ అవుతారు!
Bitter Gourd During Pregnancy in Telugu :గర్భధారణ సమయం అనేది ప్రతి మహిళ జీవితంలోనూ ఎంతో ప్రత్యేకమైనది మరియు సున్నితమైనది. ఈ సమయంలో ఆహార విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. సాధారణ రోజుల్లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందించే కాకరకాయ… ప్రెగ్నెన్సీ సమయంలో మాత్రం కొన్ని అనర్థాలకు దారితీసే అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
కాకరకాయ చేదుగా ఉంటుందని చాలా మంది తినటానికి ఇష్టపడరు. చేదుగా ఉన్నప్పటికీ చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండుసార్లు తింటే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి గర్భధారణ సమయంలో కాకరకాయ తినవచ్చా అనే సందేహం ఉంటుంది.

ఎందుకంటే గర్భధారణ సమయంలో తీసుకొనే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాకరకాయ తింటే దానిలో ఉండే ఫైబర్ జీర్ణ సంబంద సమస్యలు లేకుండా చేస్తుంది. కాకరకాయలో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలంగా ఉంటుంది.శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలంగా ఉంటే ఎటువంటి ఇన్ఫెక్షన్ దగ్గు, జలుబు, జ్వరం వంటివి రావు.
చాలా మంది కాకర కాయని తొక్కతీసి వండుకుంటారు. తొక్కతోపాటు తింటేనే ప్రయోజనాలు కలుగుతాయి. మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. కాకరకాయలో ఫోలిక్ ఆమ్లం సమృద్ధిగా ఉండటం వలన పుట్టబోయే బిడ్డలో నాడీ లోపాలు లేకుండా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి డయాబెటిస్ వస్తూ ఉంటుంది. డెలివరీ అయ్యాక డయాబెటిస్ ఉండదు.
ఇలా గర్భధారణ సమయంలో డయాబెటిస్ రాకుండా ఉండాలంటే కాకరకాయ తీసుకోవాలి. ఇలా కాకరకాయను తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉండేలా చేసి డయాబెటిస్ రాకుండా చేస్తుంది. కాకరకాయలో సహజసిద్ధమైన యాంటీ డయాబెటిక్ లక్షణాలు ఉన్నాయి. ఈ చేదులో ఉండే చరాన్టిన్ ,పాలీప్టైడ్-పి వంటి కొన్ని పోషకాలు గర్భధారణ సమయంలో డయాబెటిస్ తో పోరాడటానికి సహాయపడతాయి.
కాకరకాయ గర్భిణీ స్త్రీలలో పేగు కదలికలను ,జీర్ణవ్యవస్థను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులోని పోషకాలు శరీరం నుండి విషాన్ని తొలగించడానికి, పేగు పురుగులను తొలగించడానికి ,ఆకలిని తగ్గించడానికి సహాయపడతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

