బ్యూటీ పార్లర్కు వెళ్లే టైమ్ లేదా? ఇంట్లోనే శనగపిండితో ఇలా చేస్తే ముఖం తళతళ మెరిసిపోతుంది!
Besan For Face Glow:బ్యూటీ పార్లర్ కి వెళ్ళటానికి సమయం లేనివారు…ఇలా చేస్తే ముఖం తెల్లగా మెరిసిపోతుంది.. అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ తిరగవలసిన అవసరం లేదు. మన వంటింటిలో ఉన్న వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా నల్లని మచ్చలు లేని తెల్లని కాంతివంతమైన చర్మాన్ని పొందవచ్చు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి అందం మీద శ్రద్ద బాగా పెరిగింది.
చర్మంపై ఉన్న మృతకణాలు, జిడ్డును తొలగించి ఇన్ స్టంట్ గ్లో ఇవ్వడంలో శనగపిండి అద్భుతంగా పనిచేస్తుంది. ఎలాంటి రసాయనాలు లేకుండా, ఇంట్లోనే సులభంగా తయారు చేసుకునే ఈ శనగపిండి ఫేస్ ప్యాక్ తయారీ విధానం, దాని వల్ల కలిగే అద్భుతమైన ప్రయోజనాలు ఈ ఆర్టికల్లో వివరంగా చదవండి.

ముఖం మీద నల్లని మచ్చలు, మొటిమలు,మురికి వంటివి లేకుండా ముఖం తెల్లగా కాంతి వంతంగా మెరవాలంటే ఇంటి చిట్కాలు చాలా ఎఫెక్ట్ గా పని చేస్తాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్లి వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మన ఇంటిలో ఉన్న సహజసిద్దమైన పదార్థాలతో చాలా సులభంగా అందమైన కాంతివంతమైన తెల్లని ముఖాన్ని సొంతం చేసుకోవచ్చు.
ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పొడి, 4 స్పూన్ల పచ్చిపాలు వేసి బాగా ఉండలు లేకుండా కలపాలి. ఆ తర్వాత ఒక స్పూన్ శనగపిండి వేసి బాగా కలపాలి. పాలల్లో కాఫీ పొడి., శనగపిండి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని పొయ్యి మీద పెట్టి రెండు నుంచి మూడు నిమిషాలు కలుపుతూ ఉంటే ఒక పేస్ట్ లా తయారవుతుంది. .
ఈ పేస్ట్ చల్లారిన తర్వాత ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఫ్రిజ్ లో పెడితే మూడు రోజులు వరకు నిల్వ ఉంటుంది. ఈ పేస్ట్ ని ముఖం మీద రాసి పది నిమిషాలు అయ్యాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే ముఖం మీద జిడ్డు, మురికి, నలుపు, మొటిమలు అన్నీ తొలగిపోయి ముఖం అందంగా కాంతివంతంగా మెరుస్తుంది.
కాఫీలో ఉండే కెఫీన్ టిష్యూ రిపేర్ కి సహాయపడుతుంది. అందువల్ల సెల్ గ్రోత్ బాగుంటుంది, స్కిన్ కూడా మృదువుగా మంచి కాంతితో మెరుస్తూ ఉంటుంది. కాఫీ బ్లడ్ సర్క్యులేషన్ ని ఇంప్రూవ్ చేస్తుంది. కాబట్టి స్కిన్ కూడా హెల్దీ గా ఉంటుంది. కాఫీ పొడి చాలా సులువుగా అందుబారులో ఉంటుంది.
శనగపిండి ముఖం మీద మృత కణాలను తొలగించి ముఖం కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది. పాలల్లో ఉన్న పోషకాలు చర్మానికి అవసరమైన పోషణను అందిస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో చాలా సులభంగా ఈ ప్యాక్ తయారుచేసుకొని వాడి మచ్చలు లేకుండా తెల్లని అందమైన ముఖాన్ని సొంతం చేసుకోండీ.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

