Healthhealth tips in telugu

ఆకుపచ్చ బెండకాయ కాదు.. ‘ఎర్ర బెండకాయ’తో కలిగే అద్భుత ప్రయోజనాలివే!

Red Ladies Fingers Benefits in telugu : ఆకుపచ్చ బెండకాయలు మనందరికీ తెలుసు, కానీ ఎర్ర బెండకాయల (Red Okra) గురించి ఎప్పుడైనా విన్నారా? ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో నిండి ఉండే ఈ ఎర్ర బెండకాయ మన ఆరోగ్యానికి ఓ దివ్యౌషధం లాంటిది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుంచి రోగనిరోధక శక్తిని పెంచే వరకు.. ఎర్ర బెండకాయలతో కలిగే ఊహించని అద్భుత ప్రయోజనాలు ఏంటో ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

మనం సాధారణంగా ఆకుపచ్చ రంగులో ఉండే బెండకాయలను కూరగా వండుకుంటారు. కానీ ఇప్పుడు ఎర్ర బెండకాయలు మార్కెట్లో కి వస్తున్నాయి. వీటికి ప్రస్తుతం మార్కెట్లో చాలా డిమాండ్ ఉంది. ఆకుపచ్చని బెండకాయలు కన్నా ఎర్ర బెండకాయలో ఎక్కువ పోషకాలు ఉంటాయి.
Red Ladies Fingers Benefits in telugu
ఈ ఎర్ర బెండకాయలు చలి ఎక్కువగాఉన్న ప్రాంతాలలో పండుతాయి. ఈ బెండకాయలకు దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందంట. ఈ బెండకాయలో సూక్ష్మ పోషకాలు ఎక్కువగా ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ కి వెళ్ళినప్పుడు ఎర్ర బెండకాయలు కనిపిస్తే తప్పనిసరిగా తెచ్చుకోండి. అలా అని ఆకుపచ్చని బెండకాయలను మానేయాల్సిన అవసరం లేదు.

ఒకసారి అవి తింటే మరొకసారి ఇవి తింటే సరిపోతుంది. రక్తహీనత సమస్యను తగ్గించటానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. ఇక పోషకాల విషయానికి వస్తే సాదారణ బెండకాయతో పోలిస్తే ఎక్కువగా పోషకాలు ఉంటాయి. ఎర్ర బెండకాయలో విటమిన్ సి, విటమిన్ ఎ, ఫోలాసిన్ మరియు ఇతర బి విటమిన్లు,మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం,ఫైబర్ సమృద్దిగా ఉండికేలరీలు తక్కువగా ఉంటుంది.

ఫోలేట్ గర్భిణీ స్త్రీలకు ప్రయోజనకరంగా ఉంటుంది. దీనిలో సోడియం చాలా తక్కువగా ఉండటం మరియు బహుళఅసంతృప్త కొవ్వు సమృద్దిగా ఉండుట వలన చెడు కొలెస్ట్రాల్ ని తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ సి,ఐరన్ సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.

ప్రొటీన్‌లు ఉండటం వల్ల శరీరానికి అవసరమైన శక్తిని అందించి రోజంతా హుషారుగా పనులు చేసుకోవటానికి సహాయపడుతుంది. ఎర్ర బెండకాయను తీసుకోవడం వల్ల దానిలోని ఐరన్ కంటెంట్ మరియు ప్రొటీన్ కంటెంట్ శరీరంలో జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి కూడా చాలా మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."