Healthhealth tips in telugu

ఉదయాన్నే నార్మల్ టీకి బదులు ‘కొబ్బరి పాల టీ’ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా?

Coconut Milk Tea Benefits In Telugu : రోజూ తాగే రెగ్యులర్ టీకి బదులుగా ఒక్కసారి కొబ్బరి పాలతో చేసిన టీని మీ డైట్ లో చేర్చుకోండి. అద్భుతమైన రుచితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొబ్బరి పాల టీ తాగడం వల్ల బరువు తగ్గడం, జీర్ణక్రియ మెరుగుపడటంతో పాటు శరీరానికి కలిగే ఆశ్చర్యకరమైన ప్రయోజనాల గురించి ఈ ఆర్టికల్‌లో వివరంగా తెలుసుకోండి.

ప్రతి రోజు మనం కొబ్బరిని పచ్చడి, కూరల్లో వేసుకోవటం, స్వీట్ ల తయారీలో…ఇలా ఎన్నో రకాలుగా వాడుతూ ఉంటాం. మనం ఉదయం లేవగానే టీ తాగితేనే రోజంతా హుషారుగా ఉంటాం. ఒక రకంగా చెప్పాలంటే టీ తాగకపోతే రోజు గడవదు.

అలాంటి టీని కొబ్బరి పాలతో తయారుచేసుకొని తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. కొబ్బరిలో సంతృప్త కొవ్వు పదార్థాలు, లారీక్ యాసిడ్, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, ఫైబర్, విటమిన్ సి వంటివి చాలా సమృద్ధిగా ఉంటాయి. ఇక కొబ్బరి టీ ఎలా తయారుచేసుకోవాలో చూద్దాం.

పొయ్యి మీద గిన్నె పెట్టి నాలుగు కప్పుల నీటిని పోయాలి. ఆ తర్వాత మూడు గ్రీన్ టీ బ్యాగులు వెయ్యాలి. ఆ తర్వాత అర కప్పు కొబ్బరి పాలు, రెండు టేబుల్ స్పూన్ల క్రీం వేసి బాగా కలపాలి. 2 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత గ్రీన్ టీ బ్యాగ్స్ తీసేసి ఈ టీ ని వడకట్టి తాగాలి. రుచికి అవసరం అనుకుంటే కొంచెం పటికబెల్లం వేసుకోవచ్చు.

ఈ టీ తీసుకోవడం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎందుకంటే కొబ్బరిలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది. శరీరం యొక్క .జీవక్రియను ప్రోత్సహించి శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొవ్వును కరిగించి అధిక బరువు సమస్య నుంచి బయట పడటానికి సహాయపడుతుంది.

కొబ్బరిలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేసి గుండె ఆరోగ్యం గా ఉండేలా చేస్తుంది. అయితే కొబ్బరి టీ ని ఎక్కువగా తాగితే జీర్ణక్రియ సమస్యలను కలిగిస్తుంది. అలాగే గర్భిణీ స్త్రీలు, తల్లిపాలు ఇచ్చే మహిళలు ఎక్కువగా కొబ్బరి టీ తాగకుండా ఉంటేనే మంచిది.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."