Healthhealth tips in telugu

హాస్పిటల్స్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు.. ఈ గింజలు ఇంట్లో ఉంటే చాలు 15 రోజుల్లో థైరాయిడ్ కంట్రోల్!

Thyroid reduced food In telugu :థైరాయిడ్ సమస్యతో బాధపడేవారికి బార్లీ గింజలు (Barley Seeds) ఒక దివ్యౌషధం. కేవలం 15 రోజుల్లో థైరాయిడ్ కంట్రోల్ కావాలంటే బార్లీ గింజలను ఎలా వాడాలి? తయారు చేసుకునే విధానం ఏంటో ఈ ఆర్టికల్ లో పూర్తి వివరాలు చదవండి.

ఇటీవల కాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. ఈ సమస్య ఎక్కువగా ఆడవారిలో కనిపిస్తుంది. కానీ ఈ మధ్య కాలంలో మగవారిలో కూడా కనిపిస్తుంది. థైరాయిడ్ సమస్య వచ్చిందంటే కచ్చితంగా జీవితకాలం మందులు వాడాల్సిందే. అలాగే కొన్ని సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.
Thyroid remedies
అందువల్ల థైరాయిడ్ సమస్య ఉన్నవారు కొన్ని ఆహారాలు తీసుకుంటే మంచిది. థైరాయిడ్ ఉన్న వారిలో అలసట., నీరసం, ఒత్తిడి, మైకం వంటి సమస్యలు ఉంటాయి. థైరాయిడ్ ను నియంత్రణలో ఉంచేందుకు జింక్, ఐరన్, మెగ్నీషియం, అయోడిన్, విటమిన్ బి, సి, డి, సెలేనియం వంటి పోషకాలు అవసరం.

ఈ పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే థైరాయిడ్ నియంత్రణలో ఉంటుంది. థైరాయిడ్ సమస్య ఉన్నవారు బార్లీ గింజలను తీసుకుంటే థైరాయిడ్‌ సమస్య తగ్గుతుంది. బార్లీ గింజలను నీటిలో ఉడికించి ఆ నీటిని వడకట్టి తాగాలి. లేదంటే బార్లీ పిండిని జావగా చేసుకొని తాగవచ్చు. లేదంటే బార్లీ పిండిని ప్రతి రోజు ఒక స్పూన్ మోతాదులో కూరల్లో లేదా చపాతీ,అట్లు వంటి వాటిలో కలుపుకొని తినవచ్చు.

బార్లీ గింజలు మనకు సులువుగానే అందుబాటులో ఉంటాయి. చాలా తక్కువ ఖర్చులో దొరుకుతాయి. అలాగే బార్లీ నీటిని తాగటం వలన థైరాయిడ్‌ సమస్య తగ్గటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. అలసట,నీరసం లేకుండా రోజంతా హుషారుగా ఉంటారు. మంచి పోషకాలు ఉన్న ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

థైరాయిడ్‌ సమస్య ఉన్నవారు తగినంత నీరు తాగాలి. అలాగే తగినంత నిద్ర ఉండాలి. ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఇలా థైరాయిడ్‌ ని నియంత్రణలో ఉంచే ఆహారాలను తీసుకుంటూ…ప్రతి రోజు అరగంట వ్యాయామం చేయాలి. అప్పుడే థైరాయిడ్‌ నియంత్రణలో ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏమిటంటే థైరాయిడ్‌ ఉన్నవారు డాక్టర్ సూచన ప్రకారం తప్పనిసరిగా మందులు వాడాలి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."