ఉల్లిపాయతో ఈ చిన్న పని చేస్తే చాలు.. జుట్టు రాలడం ఆగిపోయి 100% ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది!
Onion And Almond Oil Hair Care Tips:మారుతున్న వాతావరణం, ఒత్తిడి, పోషకాల లోపం వల్ల జుట్టు రాలడం అనేది ప్రతి ఒక్కరినీ వేధిస్తున్న అతి పెద్ద సమస్య. రాలుతున్న జుట్టును చూసి ఆందోళన చెందుతూ, మార్కెట్లో దొరికే ఖరీదైన షాంపూలు, నూనెలు వాడి విసిగిపోయారా?
అయితే మీ ఇంట్లో ఉండే ఉల్లిపాయ మీ జుట్టుకు సంజీవనిలా పనిచేస్తుంది. ఉల్లిపాయలో పుష్కలంగా ఉండే సల్ఫర్ జుట్టు కుదుళ్లను దృఢంగా మార్చి, ఊడిపోయిన చోట కొత్త జుట్టును మొలకెత్తిస్తుంది.
జుట్టు రాలడం తక్షణమే ఆగిపోయి 100% ఒత్తుగా, పొడవుగా, నల్లగా పెరగాలంటే ఉల్లిపాయను సరైన పద్ధతిలో ఎలా వాడాలో, దేనితో కలిపి రాసుకోవాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఉల్లిపాయతో ఇలా చేస్తే జుట్టు రాలకుండా 100 % ఒత్తుగా,పొడవుగా పెరుగుతుంది.. ఉల్లిపాయలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు మరియు బ్యూటీ ప్రయోజనాలు ఉన్నాయి.
ముఖ్యంగా జుట్టుకి సంబందించిన సమస్యలను తగ్గించటానికి ఉల్లిపాయ చాలా బాగా సహాయపడుతుంది. ఉల్లిపాయ జుట్టుకి ఒక టానిక్ వలే పనిచేస్తుంది. మారిన పరిస్థితుల కారణంగా ఈ మధ్యకాలంలో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనబడుతోంది.

అంతే కాకుండా తల మీద చుండ్రు, ఇన్ఫెక్షన్, దురద వంటి సమస్యలు కూడా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయి. వీటిని తగ్గించుకోవటానికి మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడాల్సిన అవసరం లేదు. ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఒక ఉల్లిపాయని తీసుకొని తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసి దాని నుంచి రసం తీయాలి.
ఈ రసంను ఒక బౌల్లో తీసుకోవాలి. ఆ తర్వాత ఒక స్పూన్ బాదం నూనె,గుడ్లు తెల్ల సొన వేసి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఈ ప్యాక్ ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు అప్లై చేయాలి. అరగంట తర్వాత కుంకుడుకాయతో తల స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వలన జుట్టు కుదుళ్లు బలంగా అయ్యి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. .
అలాగే చుండ్రు, దురద, ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు అన్ని తొలగిపోతాయి. తెల్ల జుట్టు నల్లగా కూడా మారుతుంది. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేస్తే సరిపోతుంది. ఉల్లిపాయలో సల్ఫర్, జింక్, ఫాస్ఫరస్, సెలీనియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్య, చుండ్రు, ఇన్ఫెక్షన్ వంటి వాటిని తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది
బాదం నూనెలో విటమిన్ E సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్లకు అవసరమైన బలాన్ని మరియు పోషణను అందిస్తుంది. గుడ్డు తెల్లసొనలో ఉండే పోషకాలు జుట్టు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లను అందించి జుట్టు రాలకుండా చేస్తుంది. ఈ చిట్కాలో ఉపయోగించిన అన్నీ ఇంగ్రిడియన్స్ సులభంగానే అందుబాటులో ఉంటాయి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

