ఈ గింజలను ఉడికించి తింటే చాలు.. రక్తనాళాల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ఇట్టే కరిగిపోతుంది!
kabuli chana Benefits in Telugu : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మందిని వేధిస్తున్న ప్రధాన సమస్య ‘కొలెస్ట్రాల్’. మారిన జీవనశైలి, చెడు ఆహారపు అలవాట్ల వల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి గుండె జబ్బులకు దారి తీస్తోంది.
అయితే, మన ఇంట్లో సులభంగా దొరికే ఒక రకమైన గింజలను ఉడికించి రోజూ తీసుకుంటే.. శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్ (LDL) వెన్నలా కరిగిపోతుంది. రక్తప్రసరణను మెరుగుపరిచి, గుండెను పదిలంగా ఉంచడమే కాకుండా ఎన్నో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఆ గింజలు ఏమిటి? వాటిని సరైన పద్ధతిలో ఎలా ఉడికించి తినాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
కాబూలీ శనగలలో ఎన్నో పోషకాలు మరియు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వారంలో రెండు సార్లు వీటిని తింటే మంచి ప్రయోజనాలు కలుగుతాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్ చాలా సమృద్దిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో విటమిన్ సి సమృద్దిగా ఉండుట వలన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

అలాగే విటమిన్ బి6, ఫోలేట్, మాంగనీస్, కాల్షియం, ఫైబర్, ఐరన్, పొటాషియం మరియు మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. కాబట్టి ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యమైన పాత్రను పోషిస్తాయి. కాబూలీ శనగల్లో తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ మరియు తక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఉంటుంది.
అందువల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అకస్మాత్తుగా పెరగకుండా నివారిస్తుంది. డయాబెటిస్ ఉన్నవారు కాబూలీ శనగలను తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కాబూలీ శనగల్లో ప్రోటీన్,ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన బరువు తగ్గే ప్రణాళిక ఉన్నవారికి చాలా బాగా సహాయపడుతుంది.
కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండేలా చేసి తొందరగా ఆకలి లేకుండా చేస్తుంది. దాంతో ఎక్కువ ఆహారం తీసుకోకపోవటం వలన బరువు తగ్గుతారు. కాబూలీ శనగల్లో పొటాషియం సమృద్దిగా ఉండుట వలన గుండె ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతుంది. దీనికి తోడు విటమిన్ సి, ఫైబర్ మరియు విటమిన్ బి6 కూడా గుండె ఆరోగ్యానికి సహాయపడతాయి.
రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం మరియు రక్తనాళాలలో పేరుకుపోయిన కొవ్వు మొత్తాన్ని తగ్గించడమే కాకుండా, ధమనులలో రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. కాబూలీ శనగలను నానబెట్టి ఉడికించి తింటే మంచిది. కాబూలీ శనగలు విరివిగానే లభ్యం అవుతాయి. కాబట్టి వారంలో రెండు సార్లు తినటానికి ప్రయత్నం చేయండి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

