జుట్టు విపరీతంగా రాలిపోతోందా? పెరుగులో ‘ఇది’ కలిపి రాస్తే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!
Curd For Hair:ప్రస్తుత రోజుల్లో కాలుష్యం, ఒత్తిడి, పోషకాహార లోపం వల్ల వయసుతో సంబంధం లేకుండా చాలామంది జుట్టు రాలడం (Hair Fall) సమస్యతో బాధపడుతున్నారు. మార్కెట్లో దొరికే ఖరీదైన ప్రొడక్ట్స్ వాడి విసిగిపోయారా? అయితే మన వంటగదిలో ఉండే ‘పెరుగు’ (Curd) మీ జుట్టుకు సంజీవనిలా పనిచేస్తుంది.
పెరుగులో ఉండే ప్రోటీన్స్, లాక్టిక్ యాసిడ్ కుదుళ్లను బలోపేతం చేస్తాయి. అయితే పెరుగులో కేవలం ఈ ఒక్క న్యాచురల్ ఇంగ్రిడియంట్ కలిపి రాస్తే చాలు.. చుండ్రు, హెయిర్ ఫాల్ తగ్గిపోయి జుట్టు ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది. ఆ మ్యాజిక్ హెయిర్ ప్యాక్ ఎలా తయారు చేసుకోవాలో ఈ ఆర్టికల్ లో వివరంగా తెలుసుకుందాం.
పెరుగులో కలిపి రాస్తే జుట్టు రాలకుండా చాలా వేగంగా పెరుగుతుంది.. ఈ రోజు జుట్టు రాలకుండా ఒత్తుగా పెరగటానికి నల్లనువ్వులను ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వులలో పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మూడు స్పూన్ల నల్ల నువ్వులను శుభ్రంగా కడిగి నీరు పోసి రాత్రి సమయంలో నానబెట్టాలి.

మరుసటి రోజు ఉదయం నానిన నువ్వులను మెత్తని పేస్ట్ గా చేయాలి. ఈ పేస్ట్ లో ఒక స్పూన్ పెరుగు,ఒక స్పూన్ ఆలోవెరా జెల్,ఒక స్పూన్ నువ్వుల నూనె,అరస్పూన్ నిమ్మరసం వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట తర్వాత కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి.
ఈ విధంగా జుట్టు రాలే సమస్యను బట్టి వారంలో ఒకసారి లేదా రెండు సార్లు చేయాలి. ఈ విధంగా చేస్తే జుట్టు రాలే సమస్య తగ్గటమే కాకుండా చుండ్రు సమస్య కూడా తగ్గుతుంది. జుట్టు కుదుళ్లు బలంగా మారి జుట్టు రాలటం అగుతుంది. నల్ల నువ్వులలో ఉన్న పోషకాలు జుట్టు రాలకుండా చేయటమే కాకుండా తెల్లజుట్టును నల్లగా మారుస్తుంది.
ఈ ప్యాక్ జుట్టుకి వేయటం వలన జుట్టు కుదుళ్లు బలంగా మారటమే కాకుండా జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉంటుంది. తేమగా ఉండుట వలన చుండ్రు సమస్య కూడా ఉండదు. జుట్టు కాంతివంతంగా మెరుస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com
“Curd for hair growth in telugu, perugu hair pack in telugu, hair fall control home remedies in telugu, tips for long and thick hair telugu, dandruff control tips, telugu beauty tips, జుట్టు రాలకుండా చిట్కాలు, పెరుగుతో హెయిర్ ప్యాక్, జుట్టు ఒత్తుగా పెరగడానికి.”

