Beauty Tips

తెల్ల జుట్టు నల్లగా మారాలంటే ఖరీదైన డైలు అవసరం లేదు.. ఈ ఒక్క ఆకు వాడితే చాలు!

White Hair Turn Black:చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే ఖరీదైన, కెమికల్స్ నిండిన హెయిర్ కలర్స్ వాడి విసిగిపోయిన వారికి ఇదొక అద్భుతమైన న్యాచురల్ చిట్కా. ఎలాంటి ఖర్చు లేకుండా కేవలం ఒకే ఒక్క ఆకుతో మీ తెల్ల జుట్టును సహజంగా, ఆరోగ్యకరంగా నల్లగా ఎలా మార్చుకోవచ్చో, దీని తయారీ విధానం ఏంటో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.
Curry Leaves EyeSight

జుట్టు రంగు కోసం ఖరీదైన ఉత్పత్తులు అవసరం లేదు..ఈ ఆకు చాలు… మనం తీసుకునే ఆహారం జుట్టు మీద ప్రభావాన్ని చూపుతుంది. జుట్టు రాలే సమస్య, తెల్ల జుట్టు, పొడి జుట్టు, చుండ్రు వంటి అనేక రకాల సమస్యలకు కారణం కావచ్చు.

జుట్టు సమస్యలను తగ్గించుకోవడానికి మార్కెట్లో షాంపూ, కండిషనర్, ఆయిల్, కలర్ వంటివి లభ్యమవుతాయి. మనలో చాలామంది వాటిని వాడుతూ ఉంటారు.

అయితే వాటిలో కొన్ని ప్రమాదకరమైన రసాయనాలు ఉండటం వలన కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటి చిట్కాల ద్వారా సమస్యల నుంచి బయటపడవచ్చు. మనం రెగ్యులర్ గా వాడే కరివేపాకు జుట్టును నల్లగా మారుస్తుంది. అధిక ఒత్తిడి, ఆందోళన, నిద్రలేమి, జుట్టుకు సరైన పోషణ లేకపోవడం వంటి అనేక రకాల కారణాలతో చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్య వచ్చేస్తుంది.

ఈ సమస్యకు కారణం మెలనిన్ లేకపోవడం. మెలనిన్ అనేది కరివేపాకులో సమృద్ధిగా ఉంటుంది. కరివేపాకు మాస్క్ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కరివేపాకులో జుట్టు సమస్యలకు చెక్ పెట్టే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. గుప్పెడు కరివేపాకు, గుప్పెడు వేప ఆకులను మిక్సీలో వేసి మెత్తని పేస్ట్ గా చేసుకోవాలి.

ఈ పేస్ట్ లో నాలుగు స్పూన్ల కొబ్బరినూనె, ఒక విటమిన్ ఈ క్యాప్సిల్, మూడు స్పూన్ల పెరుగు వేసి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి వేడి చేయాలి. ఈ మిశ్రమం కాస్త చల్లారిన తర్వాత జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు బాగా పట్టించి అరగంట తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు సమస్య,జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్య ఇలా అన్ని రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.

అలాగే ఆహారంలో కరివేపాకును చేర్చుకోవాలి. కరివేపాకులో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. కరివేపాకును ప్రతి రోజు ఉదయం సమయంలో నమిలితే ఇంకా తొందరగా మంచి పలితం వస్తుంది. కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేని ఈ పద్దతిని ఫాలో అవ్వండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."