Healthhealth tips in telugu

ధనియాలు, బెల్లం కలిపి తింటే మీ శరీరంలో జరిగే అద్భుతాలు ఇవే!

coriander seeds and jaggery Benefits In telugu : మనం ప్రతి రోజు ఏదో ఒక రకంగా బెల్లం వాడుతూ ఉంటాం. బెల్లంలో ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజు ఒక చిన్న బెల్లం ముక్క తింటే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు కూడా తినమని చెప్పుతున్నారు.
Jaggery Health Benefits in Telugu
అలాగే ధనియాలలో కూడా ఎన్నో పోషకాలు, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ధనియాలు ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారం అని చెప్పవచ్చు. ధనియాలు యాంటీ బయటిక్ గా కూడా పనిచేస్తుంది. జీర్ణ సంబంద సమస్యలను తగ్గించటంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఎన్నో ప్రయోజనాలు ఉన్న బెల్లం,ధనియాలను కలిపి తీసుకుంటే ఊహించని ప్రయోజనాలు కలుగుతాయి.
dhaniyalu
ధనియాలు, బెల్లం కలిపి తీసుకుంటే కండరాల నొప్పులు, కీళ్లనొప్పులు దూరం అవుతాయి. ఎముకలు బలంగా, ఆరోగ్యంగా ఉంటాయి. వయస్సు పెరిగే కొద్ది వచ్చే ఎముకలకు సంబందించి ఎముకలు గుల్లబారడం, పేలుసుగా మారటం వంటివి కూడా ఉండవు. నోటి దుర్వాసన సమస్య ఉన్నప్పుడు కూడా బెల్లం,ధనియాలు కలిపి తీసుకుంటే నోటిదుర్వాసన తగ్గటమే కాకుండా చిగుళ్ళ సమస్యలు కూడా ఉండవు.
gas troble home remedies
ఈ మధ్య కాలంలో చాలా మంది మారిన జీవనశైలి పరిస్థితి కారణంగా మలబద్దకం సమస్యతో బాధపడుతున్నారు. అలాంటి వారు రాత్రి పడుకోవటానికి అరగంట ముందు బెల్లం,ధనియాలను తీసుకుంటే ఆ సమస్య నుండి బయటపడతారు. జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడి గ్యాస్,కడుపు ఉబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు కూడా తొలగిపోతాయి.
Dhaniyalu Health benefits in telugu
ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కదా ధనియాలను,బెల్లం ఎలా తీసుకోవాలి అనే విషయానికి వస్తే…ధనియాలను పొడిగా చేసుకోవాలి. అరస్పూన్ ధనియాల పొడిలో అరస్పూన్ బెల్లం కలిపి తీసుకోవాలి…లేదంటే పొయ్యి మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోసి ఒక స్పూన్ ధనియాలు వేసి 5 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత అరస్పూన్ బెల్లం పొడి వేసి ఒక నిమిషం మరిగించి ఆ నీటిని వడకట్టి తాగవచ్చు.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."