Healthhealth tips in telugu

ఎంతటి భయంకరమైన నొప్పైనా సరే.. రాత్రి ఈ పేస్ట్ రాస్తే ఉదయానికి పరార్!

Home remedies for body pain In telugu : శరీరంలో ఎక్కడైనా నొప్పులు ఉంటే పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటాం.పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడటం వల్ల దీర్ఘ కాలికంగా ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సహజసిద్ధంగా మన ఇంటిలో సులభంగా ఉన్న వస్తువులను ఉపయోగించి తగ్గించుకోవటానికి ఈ రోజు కొన్ని చిట్కాలను తెలుసుకుందాం.
Health Benefits Of Eating Pudina
పుదీనా ఆకులను తీసుకొని బాగా కడిగి ఒక గ్లాసు నీటిలో వేసి ఏడు నుంచి పది నిమిషాల పాటు మరిగించాలి. ఇలా మరిగించడం వల్ల పుదీనా ఆకులోని పోషకాలు అన్ని నీటిలో చేరతాయి. ఈ నీటిని వడగట్టుకుని రాత్రి పడుకోవడానికి ముందు తాగాలి.పుదీనా ఆకులలో ఉండే మెంథాల్ కండరాలను సడలించి నొప్పులను తగ్గించడానికి సహాయపడుతుంది.

నీటిని వడకట్టిన తర్వాత ఉడికిన పుదీనా ఆకులు ఉంటాయి కదా ఆ ఆకులలో ఒక స్పూన్ సొంఠి పొడి, ఒక స్పూన్ పంచదార పొడి, ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి ఒక క్లాత్ తో కట్టాలి. ఈ విధంగా రాత్రి సమయంలో చేసే ఉదయం ఆ కట్టు తీసేస్తే ఒకటి రెండు రోజుల్లోనే నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది.
Joint Pains
పుదీనాలో యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ సెప్టిక్ లక్షణాలు ఉండుట వలన కీళ్ల నొప్పులను తగ్గించటమే కాకుండా కీళ్ల చుట్టూ వాపును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. పుదీనా ప్రస్తుతం చాలా విరివిగానే లభ్యం అవుతుంది. పుదీనాకు బదులుగా Peppermint ఆయిల్ కూడా లభ్యం అవుతుంది.

Peppermint Oil ని నొప్పులు ఉన్న ప్రదేశంలో రాసి సున్నితంగా మసాజ్ చేసి వేడి నీటి కాపడం పెడితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. నొప్పులు తగ్గేవరకూ ఈ విధంగా చేయాలి. సమస్య చిన్నగా ఉన్నప్పుడు ఇంటి చిట్కాలు చాలా సమర్ధవంతంగా పనిచేస్తాయి. కాబట్టి ఈ చిట్కాలను ఫాలో అవ్వండి.

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."