ఒకేసారి 4 ఓటీటీల్లోకి సూపర్ క్రైమ్ థ్రిల్లర్ ‘ది డార్క్ హెవెన్’.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీల పుణ్యమా అని భాషతో సంబంధం లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న కంటెంట్‌ను ఇంట్లోనే కూర్చుని చూసేస్తున్నాం. ఈ వారం ఇప్పటికే ‘బత్తా’, ‘సిగ్మా’ లాంటి తమిళ డబ్బింగ్ సినిమాలు మనల్ని ఎంటర్‌టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటికి తోడుగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ఒకేసారి నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో సందడి చేయడానికి రెడీ అయిపోయింది.
ఆ క్రైమ్ థ్రిల్లర్ మరేదో కాదు.. ‘ది డార్క్ హెవెన్’ (The Dark Heaven).
గత నెల 18న థియేటర్లలో విడుదలై డీసెంట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమాకి బాలాజీ దర్శకత్వం వహించారు. సిద్ధు సిద్, దర్శిక, రిత్విక కీలక పాత్రల్లో నటించారు. బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదనిపించుకున్న ఈ మూవీ, ఇప్పుడు ఏకంగా నాలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌లో.. అంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon Prime), ఆహా (Aha), సింప్లీ సౌత్ (Simply South), మరియు ఏపీ ఇంటర్నేషనల్ సౌత్ సినిమా ఓటీటీల్లో స్ట్రీమింగ్ కానుంది.
అక్టోబర్ 30 నుంచే ఈ థ్రిల్లర్ ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. అయితే ప్రస్తుతానికి ఇది కేవలం తమిళ భాషలో మాత్రమే (సబ్‌టైటిల్స్ తో) స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది.
కథేంటంటే..
మెక్కరై (Mekkarai) అనే గ్రామంలో వరుసగా జరిగే హత్యల చుట్టూ ఈ కథ సాగుతుంది. ఎవరు, ఎప్పుడు, ఎలా చనిపోతారో ముందే అంచనా వేసే ఒక ప్రాచీన పుస్తకం, పురాణాల శాపాలు, కొన్ని అతీంద్రియ శక్తుల (Supernatural elements) నేపథ్యంలో స్టోరీ నడుస్తుంది. ఈ వరుస హత్యల వెనుక అసలు ఎవరున్నారు? ఈ మరణాల మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ఇలంపారి (సిద్ధు సిద్) ఎలా ఛేదించాడు? అన్నదే ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మెయిన్ స్టోరీ.
క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్, మైథలాజికల్ టచ్ ఉన్న థ్రిల్లర్స్ ఇష్టపడేవారికి ఈ సినిమా మంచి ఆప్షన్. సబ్‌టైటిల్స్ చదువుతూ పరభాషా సినిమాలు చూసే అలవాటు ఉంటే.. ఈ అక్టోబర్ 30న ఈ మూవీని మీ వాచ్‌లిస్ట్‌లో యాడ్ చేసుకోండి!

