Healthhealth tips in telugu

పచ్చి బొప్పాయితో ఇన్ని లాభాలున్నాయా? తెలిస్తే అస్సలు వదలరు!

Raw Papaya Benefits in Telugu : బొప్పాయి మన దేశానికీ 400 సంవత్సరాల క్రితమే వచ్చింది. మెక్సికో ప్రాంతానికి చెందిన బొప్పాయి అనేక ఇతర ఉష్ణమండలాల్లో ప్రాచుర్యం పొందింది. మనదేశంలో బొప్పాయిని ప్రధానంగా ఆంధ్ర ప్రదేశ్‌, తమిళనాడు, అస్సాం, బీహార్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో విరివిగా పండిస్తున్నారు. బొప్పాయి కారకేసి కుటుంబానికి చెందింది. బొప్పాయి పండు తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలుసు.
Weight Loss tips in telugu
కానీ పచ్చి బొప్పాయిలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి చాలా మందికి తెలియదు. పచ్చి బొప్పాయిని తింటే శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. పచ్చి బొప్పాయిలో మెగ్నీషియం, పోటాషియం, విటమిన్ ఏ, సీ, ఈ, బీలు సమృద్ధిగా ఉంటాయి. అధిక బరువు సమస్యతో బాధపడుతున్నవారు ప్రతి రోజు బొప్పాయిని తింటే శరీరంలో తొందరగా కొవ్వు కరిగి బరువు తగ్గుతారు.
Diabetes In Telugu
డయాబెటిస్ తో బాధపడుతున్నవారు పచ్చి బొప్పాయి జ్యుస్ త్రాగితే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. అలాగే శరీరంలో ఇన్సులిన్ మోతాదు పెరుగుతుంది. పచ్చిబొప్పాయిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది మలబద్ధకం లాంటి సమస్యలను పరిష్కరిస్తుంది. అలాగే ఉదరంలో గ్యాస్ తయారుకావడాన్ని నివారిస్తుంది. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలాగే విటమిన్ల లోపం ఎదురుకాకుండా చూస్తుంది.

గర్భిణీలు పచ్చి బొప్పాయి పండ్లను మాత్రం తినరాదు. ఎందుకంటే వాటిల్లో ఉండే లేటెక్స్, పాలవంటి పదార్థం గర్భాశయంపై ప్రభావం చూపుతుంది. దీంతో అబార్షన్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి పచ్చి బొప్పాయి పండ్లను గర్భిణీలు తినరాదు. అయితే డెలివరీ అయ్యాక తల్లికి పాలు బాగా పడాలంటే  పచ్చి బొప్పాయి ఎంతో తోడ్పడుతుంది. తురుముకుని కూర చేసుకున్నా, పాలు, చక్కెర వేసుకుని హల్వా చేసుకున్నా మంచిదే.
Raw Papaya
పచ్చి బొప్పాయిని ఏ రూపంలో తీసుకున్న పర్వాలేదు. పచ్చి బొప్పాయిలో చైమప్యాపిన్ మరియు పాపైన్ అనే రెండు శక్తివంతమైన ఎంజైమ్స్ ఉండుట వలన ప్రోటీన్, కొవ్వులు మరియు కార్బోహైడ్రేట్ల విచ్ఛిన్నానికి సహాయపడతాయి. పచ్చి బొప్పాయిలో కెరోటినాయిడ్స్ టమోటా,క్యారెట్ ల కన్నా ఎక్కువ మొత్తంలో ఉంటాయని బ్రిటీష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ జరిపిన అధ్యయనంలో తెలిసింది.

పచ్చి బొప్పాయిలో యాంటీ ఇన్ఫ్లేమేటరీ లక్షణాలు ఉండుట వలన  ఆస్తమా, ఆస్టియో ఆర్థరైటిస్, గౌట్ మరియు రుమటాయిడ్ ఆర్థరైటిస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ , సోడియం సమృద్ధిగా ఉండుట వలన రక్త ప్రవాహాన్ని నియంత్రించి గుండె వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
Immunity foods
దీనిలో పుష్కలంగా ఉండే బీటా కెరోటిన్‌ శరీరానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్‌ దుష్ఫలితాలను నివారించి, క్యాన్సర్‌ రాకుండా నియంత్రణలో ఉంచుతుంది. పచ్చి బొప్పాయిలో విటమిన్ సి సమృద్ధిగా ఉండుట వలన తెల్ల రక్త కణాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దాంతో శరీరంలో ఇన్ ఫెక్షన్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తుంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."