కెంపు రత్నం ఎవరికి అదృష్టం? స్త్రీలా, పురుషులా?
Ruby stone Benefits In telugu : నవరత్నాలలో ‘కెంపు’ (Ruby Stone) చాలా శక్తివంతమైనది మరియు సూర్య గ్రహానికి ప్రతీక. దీనిని ధరించడం వల్ల కీర్తి, హోదా, నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం పెరుగుతాయని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
అయితే, ఈ శక్తివంతమైన కెంపు రత్నాన్ని స్త్రీ, పురుషులలో ఎవరు ధరించాలి? ఎవరు ధరిస్తే అదృష్టం వరిస్తుంది? అసలు కెంపును స్త్రీలు ధరించవచ్చా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంటుంది. రాశి చక్రాలు, గ్రహ స్థితుల ప్రకారం కెంపును ఎవరు ధరించాలి, ఏ వేలికి ధరించాలి మరియు దీనివల్ల కలిగే ఆరోగ్య, ఆర్థిక ప్రయోజనాల గురించిన పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
జాతకాలు, గ్రహదోషాలు పరిహారం కోసం అభిషేకాలు, దానాలు వంటి కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు రకరకాల రాళ్లను ధరిస్తూ ఉంటారు. ఫలానా రాశి వాళ్ళు ఫలానా రాయి ధరిస్తే మంచిదని పండితులు చెబుతుంటారు. ఇలా ధరించడం వలన ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయని అంటారు.
అయితే కీలకమైన కెంపును కూడా చాలామంది ధరించడం చూస్తాం. సంస్కృతంలో దీన్ని మాణిక్యం అని, ఆంగ్లంలో రూబీ అని అంటారు. ఈర్ష్యా ద్వేషాల బారిన పడకుండా ఉండాలంటే, కెంపు ధరిస్తే మంచిదని అంటారు. ఎరుపు వర్ణం గల కెంపు ధరిస్తే నర దిష్టి నుంచి బయట పడవచ్చని అంటారు.
జన్యు పర దోషాలు, చర్మ వ్యాధుల నుంచి రక్షణ పొందడానికి కూడా కెంపు వాడడం మంచిదని అంటారు. ఆరోగ్య సమస్యలను దరిచేరనివ్వకుండా కెంపు చూస్తుందని అందుకే దీన్ని ధరించాలని అంటారు. రాత్రి వేళల్లో నీటిలో కెంపు వేసి, ఉదయం ఆ నీటిని తాగితే రక్త దోషాలు పోతాయని అంటారు. కేంపుని ఎక్కువగా మగవాళ్ళు ధరించడం ఉత్తమమని అంటారు. కీళ్ల నొప్పులు, వంట్లో వేడిని తగ్గించే గుణం దీనికి ఉందని చెబుతారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

