Healthhealth tips in telugu

Pregnancy Diet: గర్భిణీలు మొక్కజొన్న (Corn) తినొచ్చా? తింటే కడుపులోని బిడ్డకు లాభమా, నష్టమా?

Eating Corn During Pregnancy :గర్భధారణ సమయంలో తీసుకునే ప్రతి ఆహారం విషయంలోనూ ఎంతో అప్రమత్తంగా ఉండాలి. అయితే, అందరూ ఇష్టపడే రుచికరమైన మొక్కజొన్న (Corn) గర్భిణీలు తినొచ్చా? లేదా? తింటే కడుపులోని బిడ్డపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

మొక్కజొన్నలో పుష్కలంగా ఉండే ఫోలిక్ యాసిడ్, ఫైబర్, విటమిన్లు మరియు యాంటీ ఆక్సిడెంట్లు గర్భవతులకు, పుట్టబోయే బిడ్డ ఎదుగుదలకు ఎలా సహాయపడతాయో తెలుసుకోవడం చాలా ముఖ్యం.

అలాగే, గర్భధారణ మధుమేహం (Gestational Diabetes) ఉన్నవారు మొక్కజొన్న తినే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, రోజుకు ఎంత మోతాదులో తింటే సురక్షితం అనే పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకోండి.

వర్షాకాలంలో వేడి వేడి మొక్కజొన్నను తినాలన్న కోరిక చాలా మందికి ఉంటుంది. ఇక గర్భిణులు కూడా వీటిని తింటుంటారు. ఇంతకీ గర్భిణులు వీటిని తింటే ఏమౌతుందో తెలుసా..?

సాధారణంగా గర్భధారణ సమయంలో తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఏ పొరపాటు చేసినా ఆ ప్రభావం పుట్టబోయే బిడ్డ మీద పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరు గర్భదరణ సమయంలో సలహాలు ఇస్తూ ఉంటారు.

గర్భధారణ సమయంలో కొన్ని ఆహారాలు చాలా మేలు చేస్తాయి.వాటిల్లో మొక్కజొన్న ఒకటి. అయితే మనలో చాలామంది మొక్కజొన్న తింటే కడుపు నొప్పి వస్తుందని తినడం మానేస్తుంటారు. కానీ పోషకాహార నిపుణులు మొక్కజొన్న తింటే చాలా మంచిదని చెబుతున్నారు. ఎందుకంటే సాధారణంగా గర్భధారణ సమయంలో రక్తహీనత సమస్య అనేది వస్తుంది.
mokkajonna
ఆ సమస్య రాకుండా ఉండాలంటే ఐరన్, పోలిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండే ఆహారాలు గర్భధారణ సమయంలో తింటే మంచిది. రక్తహీనత సమస్య అనేది ఉండదు. అంతేకాకుండా తగిన మోతాదులో మొక్కజొన్నను తీసుకుంటే మలబద్దకం సమస్య కూడా తొలగిపోతుంది. మొక్కజొన్నలో ఉండే ఫైబర్ మలబద్ధకం సమస్యను తొలగిస్తుంది.
Diabetes diet in telugu
అంతేకాకుండా గర్భధారణ సమయంలో ఒక్కోసారి డయాబెటిస్ కూడా వస్తుంది. అలా డయాబెటిస్ వచ్చే అవకాశాలను కూడా మొక్కజొన్న తగ్గిస్తుంది. మొక్కజొన్నలో లుటిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి, ఇవి పుట్టబోయే బిడ్డ కంటి చూపును మెరుగుపరచడంలో కీలకమైన పాత్రను పోషిస్తుంది.
Immunity foods
రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది.అలాగే గర్భధారణ సమయంలో జ్ఞాపకశక్తిని ప్రోత్సహిస్తుంది. మొక్కజొన్నలో ఉండే థయామిన్ కండరాలు మరియు నాడీ వ్యవస్థ పనితీరుకు సహాయపడుతుంది. గర్భదరణ సమయంలో మొక్క జొన్నను లిమిట్ గానే తీసుకోవాలి. ఎక్కువగా తీసుకుంటే అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."