మీ ఇంట్లో డబ్బు అస్సలు నిలవట్లేదా? అయితే ఈ మొక్కలు ఉన్నాయేమో చెక్ చేసుకోండి
మొక్కలు అనేవి ఇంటి వాతావరణాన్ని అలాగే శక్తిని ప్రభావితం చేస్తాయని వాస్తు శాస్త్రం చెబుతోంది. కొన్ని మొక్కలు ఇంటిలో పాజిటివ్ ఎనర్జీని పెంచుతాయి. అయితే మరికొన్ని మొక్కలు నెగటివ్ ఎనర్జీని పెంచి ఇంటిలో సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి మన ఇంటిలో నెగిటివ్ ఎనర్జీ ని పెంచే మొక్కలు ఏమిటో తెలుసుకుని ఆ మొక్కలు ఇంటిలో లేకుండా చేస్తే బాగుంటుంది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటిలో అసలు ముళ్ళ మొక్కలు ఉండకూడదు. ఒకవేళ ముళ్ళ మొక్కలు ఉంటే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు పెరగడమే కాకుండా మానసిక ప్రశాంతత కూడా ఉండదని మానసిక నిపుణులు సూచిస్తున్నారు. ఈ మొక్కలలో ఉండే నెగటివ్ ఎనర్జీ మన మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఇటువంటి మొక్కలను పెంచుకోవాలని అనుకుంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచుకోవచ్చు.

కొన్ని రకాల మొక్కలు ఆకులు, కొమ్మలు విరిచినప్పుడు పాలు లాంటి ద్రవం వస్తుంది. ఇలాంటి మొక్కల కారణంగా ఇంటి వాతావరణం శాంతిని కోల్పోయి అశాంతిగా ఉంటుంది. అందువల్ల ఇటువంటి మొక్కలను కూడా ఇంటి లోపల కాకుండా బయట వైపు పెంచితే మంచిది.
వాస్తు శాస్త్రం ప్రకారం ఎండిపోయిన మొక్కలను కూడా ఉంచకూడదు. ఎప్పటికప్పుడు తీసేస్తూ ఉండాలి. ఒకవేళ ఎండిపోయిన మొక్కలు ఉంటే నెగటివ్ ఎనర్జీ పెరిగి ఆర్థిక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మొక్కలు ఎండినప్పుడు వెంటనే తీసి పడేస్తే మంచిది.
బోన్ సాయి మొక్కలను కొంతమంది చాలా ఇష్టంగా పెంచుకుంటూ ఉంటారు. అయితే వాస్తు శాస్త్రం ప్రకారం బోన్సాయి మొక్కలను ఇంటిలో పెంచుకోకూడదు. బోన్సాయ్ మొక్కలను సహజంగా పెరగకుండా కత్తిరించి చిన్నగా ఉంచటం వలన వాటి ఎదుగుదల ఆగిపోవడం అనేది మన అవకాశాలను తగ్గించడానికి సంకేతంగా భావిస్తారు. అందుకే ఇటువంటి మొక్కలను ఇంటి లోపల కాకుండా బయట పెంచవచ్చు.

పెద్దగా నియంత్రణ లేకుండా పెరిగే తీగ మొక్కలను కూడా ఇంటిలో పెంచుకుంటే సమస్యలు వచ్చే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఇవి ఇంటి శక్తి ప్రవాహాన్ని అడ్డుకుంటాయని దాంతో ఇంటిలో వ్యవహారాలన్నీ అస్తవ్యస్తంగా మారిపోతాయని అంటున్నారు. కాబట్టి తీగ మొక్కలను ఇంటిలో పెంచుకోవాలంటే జాగ్రత్తగా సరైన ప్రదేశంలో సెట్ అయ్యేలా పెంచుకోవాలి.
ఇవి కూడా చదవండి:
చివరగా వాస్తు నిపుణులు ఏమి చెబుతున్నారంటే ఇంటిలో పెంచే మొక్కలు ఎప్పుడు పచ్చగా ఆరోగ్యంగా ఉండాలి. అలాగే ఇంటి తూర్పు లేదా ఉత్తర దిశలో సానుకూల శక్తిని పెంచే మొక్కలను పెంచితే బాగుంటుందని అంటున్నారు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

