Beauty Tips

గుడ్డులో ఈ పొడి కలిపి రాస్తే చాలు.. జుట్టు రాలడం ఆగి ఒత్తుగా పెరుగుతుంది!

మారిన జీవనశైలి, పోషకాహార లోపం వంటి కారణాలతో ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ జుట్టు రాలే సమస్య కనబడుతుంది. మనలో ప్రతి ఒక్కరూ జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలని కోరుకుంటారు. అలా కోరుకోవడం కూడా సహజమే.

ఎందుకంటే జుట్టు ఒత్తుగా పొడవుగా ఉంటేనే అందంగా కనబడతాము. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా పెద్దగా ఫలితం కనబడక నిరాశ చెందుతారు.

ఇప్పుడు చెప్పే చిట్కాను ఫాలో అయితే అసలు నిరాశ పడాల్సిన అవసరమే లేదు. జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అంతేకాకుండా చాలా తక్కువ ఖర్చుతోనే ఈ సమస్య నుంచి బయటపడవచ్చు.

మన ఇంటిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగిస్తే సరిపోతుంది. గుడ్డు తెల్ల సోనలో గ్రీన్ టీ పొడి వేసి బాగా కలిపి జుట్టు కుదుళ్ల నుండి చివర్ల వరకు పట్టించి అరగంట అయ్యాక గోరువెచ్చని నీటితో తల స్నానం చేయాలి.

ఒకవేళ గుడ్డు అందుబాటులో లేకపోతే గుడ్డుకు బదులు నిమ్మరసం కూడా కలపవచ్చు. గ్రీన్ టీ, నిమ్మరసం, గుడ్డు.. ఈ మూడు కూడా జుట్టు సంరక్షణలో చాలా బాగా సహాయపడతాయి.
Green Tea Brain Health Benefits
ఈ చిట్కాలు ఫాలో అయితే చాలా తక్కువ ఖర్చుతో జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేసుకోవచ్చు. గ్రీన్ టీ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది. అలాగే విటమిన్ బి సమృద్ధిగా ఉండటం వలన జుట్టును మృదువుగా ఉంచుతుంది.

కోడిగుడ్డులో బయోటిన్ మరియు విటమిన్ B కాంప్లెక్స్ విటమిన్లు సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళను బలంగా మార్చి జుట్టు రాలకుండా కొత్త జుట్టు పెరుగుదలకు సహాయపడుతుంది. ఇక నిమ్మరసం విషయానికి వచ్చేసరికి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడమే కాకుండా జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరిగేలా చేస్తుంది.

కాస్త ఓపికగా ఈ చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితాన్ని పొందవచ్చు. ఏదో ఒక వారం చేసేసి ఫలితం రాలేదు అని అనుకోకూడదు. ఒక నెల రోజులపాటు ఈ చిట్కాను ఫాలో అయితే కచ్చితంగా జుట్టు రాలే సమస్య నుంచి బయటపడవచ్చు. కాబట్టి వేల కొద్ది డబ్బులు ఖర్చు పెట్టి ఖరీదైన ఉత్పత్తులను కొనకుండా చాలా తక్కువ ఖర్చుతో ఇప్పుడు చెప్పిన ఈ రెమిడి ఫాలో అయితే సరిపోతుంది..

గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.

Source: chaipakodi.com

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."