Hair Care:”జుట్టు రాలడం ఆగి.. మోకాళ్ల దాకా పొడవుగా పెరగాలా? ఆముదాన్ని ఇలా వాడితే మ్యాజిక్ ఖాయం!”
నేటి కాలంలో ఒత్తిడి, కాలుష్యం, పోషకాలు ఉన్న ఆహారాన్ని తీసుకోకపోవడం వంటి అనేక రకాల కారణాలతో మనలో చాలామంది జుట్టు రాలే సమస్య, చుండ్రు సమస్యతో బాధపడుతున్నారు. అలాగే చాలా చిన్నవయసులోనే తెల్ల జుట్టు సమస్య కూడా వచ్చేస్తుంది.
దాంతో కంగారు పడిపోయి మార్కెట్లో దొరికే రకరకాల ఉత్పత్తులను వాడుతూ ఉంటారు. అలా మార్కెట్లో దొరికే ఉత్పత్తులను వాడటం వలన కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది.

ఆముదం నూనెను జుట్టుకు పట్టిస్తే జుట్టుకు సంబంధించిన సమస్యల నుంచి బయట పడవచ్చు. ఆముదంలో ఉండే రిసీనోలిక్ యాసిడ్ తలలో రక్తప్రసరణను మెరుగుపరిచి జుట్టు కుదుళ్ళను బలోపేతం చేసి జుట్టు ఒత్తుగా వేగంగా పెరిగేలా ప్రోత్సహిస్తుంది.
ఆముదంలో యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు స్కాల్ప్ ఇన్ఫెక్షన్ మరియు చుండ్రు సమస్యను నిమిషాల్లో తగ్గిస్తుంది. ఆముదం జుట్టుకు సహజసిద్ధమైన తేమను అందించి జుట్టు పొడిగా లేకుండా చిట్లిపోకుండా మృదువుగా ఉండేలా చేస్తుంది.

ఆముదాన్ని తలకు ఎలా అప్లై చేయాలి
ఆముదం జిడ్డుగా ఉంటుంది. కాబట్టి ఆముదంలో కొబ్బరి నూనె లేదా బాదం నూనె కలిపి జుట్టుకు పట్టించాలి. అయితే ఆముదము, కొబ్బరి నూనె లేదా బాదం నూనె రెండింటిని సమానంగా తీసుకోవాలి.
ఈ మిశ్రమాన్ని కాస్త గోరువెచ్చగా చేసి జుట్టు కుదుళ్లకు బాగా పట్టించి పది నుంచి 15 నిమిషాల పాటు చేతి వేళ్ళతో సున్నితంగా మసాజ్ చేయాలి.
ఇవి కూడా చదవండి:
ఈ విధంగా రాత్రి సమయంలో చేసి షవర్ క్యాప్ ధరించాలి.మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది.
చాల తక్కువ ఖర్చుతో చాలా సులభంగా జుట్టు రాలే సమస్య,చుండ్రు సమస్య నుండి బయట పడవచ్చు. జుట్టు సమస్యలకు వేల కొద్ది డబ్బును ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

