“పార్లర్‌కు వెళ్లి వేలు ఖర్చు చేయక్కర్లేదు.. ఇంట్లోనే నల్లని పాదాలను తెల్లగా మార్చే సీక్రెట్ ఇదే!”
మనం సాధారణంగా ముఖానికి ఎక్కువగా సంరక్షణ చేస్తూ ఉంటాం. మనలో చాలామంది పాదాలను అస్సలు పట్టించుకోరు. దీనివలన పాదాలు నల్లగా మారతాయి. చెప్పులు వేసుకున్న ఆకారం మాత్రమే తెల్లగా ఉండి మిగతా పాదం నల్లగా కనిపించి అసహ్యంగా ఉంటుంది.

ఈ సమస్య నుంచి బయటపడటానికి పెద్దగా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఏ బ్యూటీ పార్లర్ కి వెళ్లాల్సిన అవసరం లేదు. మన వంట గదిలో సహజ సిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి పాదాల నలుపును తగ్గించుకోవచ్చు.
ఒక బౌల్లో రెండు స్పూన్ల శనగపిండి, ఒక స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పాదాలకు పట్టించి పావుగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఈ విధంగా వారంలో రెండు సార్లు చేస్తూ ఉంటే నల్లని పాదాలు తెల్లగా మృదువుగా మారుతాయి.

శనగపిండి చర్మాన్ని లోతుగా శుభ్రం చేస్తుంది. అలాగే పెరుగులో ఉండే లాక్టిక్ acid చర్మం మీద నల్లని మచ్చలు, టాన్ ను సులభంగా తొలగిస్తుంది.
ఒక బౌల్ లో రెండు స్పూన్ల బంగాళదుంప రసం, ఒక స్పూను టమాటా రసం వేసి బాగా కలిపి పాదాలకు పట్టించి పావుగంట అయ్యాక శుభ్రం చేసుకోవాలి. టమాట, బంగాళదుంప రెండింటిలోనూ బ్లీచింగ్ లక్షణాలు చాలా సమృద్ధిగా ఉంటాయి. అందువలన ఈ చిట్కాను ఫాలో అయినప్పుడు నల్లని మచ్చలను తొలగించుకోవడానికి చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది
ఇవి కూడా చదవండి:
ఒక స్పూన్ కాఫీ పౌడర్ లో ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలిపి పాదాలకు పట్టించి ఐదు నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసి పావుగంట అయ్యాక పాదాలను శుభ్రం చేసుకోవాలి. కాఫీ పొడి చర్మాన్ని చాలా వేగంగా కాంతివంతంగా మార్చడంలో సహాయపడుతుంది అలాగే కొబ్బరి నూనె కూడా చర్మం లోపలి నుంచి తేమగా ఉండేలా చేస్తుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

