Skin Care Tips: బ్యూటీ పార్లర్ అవసరం లేదు.. ఇంట్లో ఉండే ఈ రెండు వస్తువులతో ముఖంపై ముడతలు, మచ్చలు మాయం!
ముఖం అందంగా, కాంతివంతంగా, ఎల్లప్పుడూ యవ్వనంగా కనిపించాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. దీని కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరుగుతూ వేల రూపాయలు ఖర్చు చేస్తుంటారు.
అయితే, మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ కాకుండా, రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే సహజసిద్ధంగా ముఖాన్ని మెరిపించుకోవచ్చు. కాస్త సమయాన్ని కేటాయిస్తే చాలు.. ముఖంపై ఉండే నల్లని మచ్చలు, ముడతలు మాయమై చర్మం మృదువుగా మారుతుంది. ఆ అద్భుతమైన హోమ్ రెమెడీ ఏంటో ఇప్పుడు చూద్దాం.

కావలసిన పదార్థాలు:
ఉడికించిన అన్నం – 1 కప్పు
బాదం నూనె (Almond Oil) – 1 స్పూన్
నీరు – తగినంత

ఫేస్ ప్యాక్ తయారీ విధానం:
ముందుగా ఒక కప్పు ఉడికించిన అన్నాన్ని తీసుకోవాలి.
ఈ అన్నాన్ని ఒక మిక్సీ జార్లో వేసి, కొద్దిగా నీటిని పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ అన్నం పేస్ట్‌ను ఒక చిన్న బౌల్లోకి తీసుకోవాలి.
అందులో ఒక స్పూన్ బాదం నూనె వేసి, రెండు పదార్థాలు బాగా కలిసేలా మిక్స్ చేయాలి.

ఇది చర్మానికి ఎలా సహాయపడుతుంది?
ఉడికించిన అన్నం: చర్మ సంరక్షణలో బియ్యం, అన్నం లేదా బియ్యప్పిండి అద్భుతంగా పనిచేస్తాయి. అన్నంలో ఉండే పోషకాలు ముఖంపై ఉండే పిగ్మెంటేషన్‌ను (నల్లటి మచ్చలను) తొలగించి, చర్మం ఎల్లప్పుడూ యవ్వనంగా, టైట్‌గా ఉండేలా చేయడంలో సహాయపడతాయి.
బాదం నూనె: బాదం నూనెలో ఉండే విటమిన్లు, పోషకాలు చర్మానికి మంచి తేమను అందిస్తాయి. ఇది ముఖంపై ఉండే మచ్చలను క్రమంగా తగ్గించి, చర్మాన్ని కాంతివంతంగా మెరిసేలా చేస్తుంది.

ఎలా ఉపయోగించాలి?
తయారుచేసుకున్న ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు సమానంగా అప్లై చేయాలి.
రాసుకున్న తర్వాత రెండు నిమిషాల పాటు చేతి వేళ్లతో సున్నితంగా మసాజ్ చేసుకోవాలి.
ఆ తర్వాత ఒక అరగంట (30 నిమిషాలు) పాటు అలాగే ఆరనివ్వాలి.
పూర్తిగా ఆరిపోయిన తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
ఇవి కూడా చదవండి:
చిట్కా: ఈ ఫేస్ ప్యాక్‌ను వారానికి కనీసం రెండు సార్లు చొప్పున క్రమం తప్పకుండా వేసుకుంటే.. ముఖంపై ఉండే ముడతలు, నల్లటి మచ్చలు అన్నీ తొలగిపోయి ముఖం గ్లోయింగ్‌గా మారుతుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

