భరించలేని పంటి నొప్పా? ఈ ఇంటి చిట్కాలతో నిమిషంలో రిలీఫ్!
నమస్తే అండీ! ప్రపంచంలో భరించలేని నొప్పుల్లో ‘పంటి నొప్పి’ (Teeth Pain) ఒకటి. దంతాలు పుచ్చిపోవడం, నోటి శుభ్రత లేకపోవడం, ఇన్ఫెక్షన్లు లేదా దంతాల నరాలు దెబ్బతినడం వల్ల ఈ నొప్పి వస్తుంటుంది.
పంటి నొప్పి వస్తే అటు ఏమీ తినలేము, ఇటు ప్రశాంతంగా నిద్రపోలేము. చిగుళ్ల వాపు కూడా తోడైతే ఇక ఆ నరకం అంతా ఇంతా కాదు.

అయితే, నొప్పి మరీ తీవ్రంగా ఉంటే కచ్చితంగా డెంటిస్ట్ ను కలవాల్సిందే. కానీ, నొప్పి ఇప్పుడే మొదలైనా లేదా రాత్రి పూట అకస్మాత్తుగా పంటి నొప్పి వచ్చినా.. మన వంటగదిలో ఉండే వస్తువులతోనే కేవలం నిమిషాల్లో ఉపశమనం పొందవచ్చు. ఆ అద్భుతమైన ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం!
పంటి నొప్పిని మాయం చేసే 3 మ్యాజిక్ చిట్కాలు ఇవే:
1. ఉల్లిరసం – కొబ్బరి నూనె మ్యాజిక్:

ఒక చిన్న గిన్నెలో ఒక స్పూన్ ఉల్లిపాయ రసం, దానికి ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న పన్ను లేదా చిగురు పై రెండు చుక్కలు వేయండి. ఇలా తరచుగా చేస్తుంటే పంటి నొప్పి ఇట్టే మాయం అవుతుంది.
2. వెల్లుల్లి – లవంగాల పేస్ట్:

రెండు వెల్లుల్లి రెబ్బలు, నాలుగు లవంగాలు తీసుకుని మెత్తటి పేస్ట్ లా నూరండి. ఈ పేస్ట్ ను నొప్పి ఉన్న పంటి మీద లేదా చిగురు మీద పెట్టి కాసేపు ఉంచండి. వీటిలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ మరియు పెయిన్ కిల్లర్ లక్షణాలు నొప్పిని లాగేస్తాయి.
3. గోరువెచ్చని ఉప్పు నీరు:

ఇది అందరికీ తెలిసిన, అత్యంత ప్రభావవంతమైన పాతకాలపు చిట్కా. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసి కలపండి. ఆ నీటిని నోట్లో పోసుకుని బాగా పుక్కిలించి (Gargle) ఉమ్మెయ్యాలి. ఇలా చేయడం వల్ల నోట్లోని ఇన్ఫెక్షన్ తగ్గి, చిగుళ్ల వాపు, నొప్పి నుంచి వెంటనే రిలీఫ్ దొరుకుతుంది.
ఇవి కూడా చదవండి:
ముఖ్య గమనిక
ఈ చిట్కాలన్నీ పంటి నొప్పి ప్రాథమిక దశలో ఉన్నప్పుడు, తాత్కాలిక ఉపశమనం కోసం మాత్రమే! మీరు ఈ ఇంటి చిట్కాలను ఫాలో అవుతూనే, వీలైనంత త్వరగా డాక్టర్ ను సంప్రదించి తగిన ట్రీట్మెంట్ తీసుకోవడం ద్వారా దంతాల సమస్యలకు శాశ్వత చెక్ పెట్టొచ్చు. కాస్త ఓపికగా ఈ చిట్కాలు పాటిస్తే మంచి ఫలితం కచ్చితంగా ఉంటుంది.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

