జూన్ 9 రాశి ఫలాలు: ఈ రోజు మీ జాతకం ఎలా ఉందంటే?
ఈ మధ్య కాలం లో మనలో చాలా మంది ప్రతి రోజు రాశి ఫలాలను చూసుకుంటున్నారు. రాశి ఫలాలను చుస్కోవచ్చు. కానీ వాటి మీద ఎక్కువగా ఆధారపడకూడదు.

మేష రాశి (Aries): ఈ రోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు తలపెట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది.

వృషభ రాశి (Taurus): ఈ రోజు మీకు ఫలవంతంగా ఉంటుంది. అయితే, కుటుంబ వ్యవహారాల్లో కొంత సహనం అవసరం. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఈరోజు శివారాధన చేయడం శ్రేయస్కరం.

మిథున రాశి (Gemini): ఉద్యోగ, వ్యాపారాల్లో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించాలి. వీలైతే వ్యాపార సంబంధిత ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది.

కర్కాటక రాశి (Cancer): మీ ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. వృథా ఖర్చులను వీలైనంత వరకు నియంత్రించండి. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

సింహ రాశి (Leo): ఉద్యోగులకు ప్రమోషన్ లభించే సూచనలున్నాయి. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. కొత్త వ్యాపారాలు లేదా వ్యాపార విస్తరణకు ఇది చాలా అనువైన సమయం.

కన్యా రాశి (Virgo): ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. సమాజంలో ప్రజాదరణ, గౌరవం పెరుగుతాయి. ఉద్యోగ, వ్యాపారాల్లో మీ నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. నూతన వాహనం లేదా వస్త్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది.

తులా రాశి (Libra): సత్సకల్పంతో మీరు చేసే పనులు త్వరగా ఫలిస్తాయి. ఒక సంఘటన మీ మానసిక బలాన్ని అమాంతం పెంచుతుంది. ప్రయాణాలు లాభిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio): ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగించవచ్చు, ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం కొద్దిగా అస్థిరంగా ఉండవచ్చు. కాబట్టి ముఖ్యమైన నిర్ణయాలను వాయిదా వేయడం మంచిది.

ధనుస్సు రాశి (Sagittarius): కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక పరమైన లాభాలు అందుకుంటారు. ఈశ్వరుని ఆలయ సందర్శనం మీకు శుభాలను చేకూరుస్తుంది.

మకర రాశి (Capricorn): ఉద్యోగంలో పదోన్నతులతో పాటు స్థానచలనం కూడా ఉండవచ్చు. వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలు సత్ఫలితాలను ఇస్తాయి.

కుంభ రాశి (Aquarius): మీ ప్రయత్నాలు, బాధ్యతలు, కర్తవ్యాలు అన్నీ నెరవేరుతాయి. సమాజంలో మీ పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి.

మీన రాశి (Pisces): స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపుతారు. గృహంలో శాంతి, సౌఖ్యాలు నెలకొంటాయి. అయితే, ఆరోగ్యాన్ని ఏమాత్రం అశ్రద్ధ చేయవద్దు. దుర్గాదేవి దర్శనం లేదా పూజ మీకు శుభకరం.
గమనిక: పండితులు మరియు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అందించిన అంచనాల మేరకు ఈ వివరాలు ఇవ్వబడ్డాయి. మీ వ్యక్తిగత జాతక గ్రహస్థితులను బట్టి ఫలితాల్లో చిన్నపాటి మార్పులు ఉండవచ్చు.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

