1 గ్లాస్, 15 రోజులు: పొట్ట కొవ్వుకు చెక్, ఇమ్యూనిటీ డబుల్!
ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలామందిని వేధిస్తున్న అతి పెద్ద సమస్య.. ‘అధిక బరువు’. వ్యాయామం లేకపోవడం, గంటల తరబడి టీవీలు, ఫోన్ల ముందు కూర్చోవడం, జంక్ ఫుడ్ ఎక్కువగా తినడం వల్లే ఈ బరువు సమస్య వస్తుందని మనందరికీ తెలుసు. అయితే, జిమ్‌లకు వెళ్లి చెమటోడ్చకుండా, ఇంట్లోనే దొరికే ఒక సింపుల్ అండ్ హెల్తీ డ్రింక్‌తో ఈ అధిక బరువుకు ఎలా చెక్ పెట్టొచ్చో ఇప్పుడు చూద్దాం.
దీనికోసం మనం వాడేది క్యారెట్. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలను అందించే క్యారెట్లో విటమిన్ ఎ, సి, కె, బి, అలాగే ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్, ప్రోటీన్ ఇలా ఎన్నో అద్భుతమైన పోషకాలు ఉంటాయి. మరి ఈ క్యారెట్ తో వెయిట్ లాస్ డ్రింక్ ఎలా చేసుకోవాలో చూద్దామా!

కావాల్సిన పదార్థాలు:
క్యారెట్ – 1
ఖర్జూరాలు (గింజ తీసినవి) – 3
పసుపు – పావు స్పూన్
పీనట్ బట్టర్ – 1 స్పూన్
దాల్చిన చెక్క పొడి – అర స్పూన్
పాలు – 1 గ్లాసు
తయారీ విధానం:
ముందుగా ఒక క్యారెట్ తీసుకుని శుభ్రంగా కడిగి, పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ముక్కలను కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా ఉడికించాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో ఉడికించిన క్యారెట్ ముక్కలు, 3 ఖర్జూరాలు, పసుపు, పీనట్ బట్టర్, దాల్చిన చెక్క పొడి వేసుకోవాలి. దీనికి కొద్దిగా నీళ్లు జతచేసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి.
తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నెలో ఒక గ్లాసు పాలు పోసి వేడి చేయాలి. పాలు కొద్దిగా కాగాక, అందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్‌ను వేసి బాగా కలపాలి. దీన్ని ఓ 4 నిమిషాల పాటు చిన్న మంట మీద ఉడికించి దించేసుకుంటే.. టేస్టీ అండ్ హెల్తీ వెయిట్ లాస్ డ్రింక్ రెడీ!
ఎలా తాగాలి? ఎప్పుడు తాగాలి?
ఈ క్యారెట్ పాలను ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడానికి ఒక గంట ముందు తాగాలి. ఒకవేళ ఉదయం కుదరకపోతే రాత్రి పడుకోవడానికి ఒక గంట ముందు అయినా తాగొచ్చు.
దీనివల్ల లాభాలు ఏంటి?
ఇలా ఒక 15 రోజుల పాటు క్రమం తప్పకుండా తాగితే రిజల్ట్ మీకే అర్థమవుతుంది. శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వు, ముఖ్యంగా పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు కరిగిపోయి బానపొట్ట ఫ్లాట్‌గా మారుతుంది. అంతేకాకుండా ఇందులోని పోషకాల వల్ల మీ రోగనిరోధక శక్తి (ఇమ్యూనిటీ) కూడా పెరిగి సీజనల్ వ్యాధులు, ఇన్ఫెక్షన్లు దరిచేరవు.
గమనిక: ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ముందుగా వైద్యులను సంప్రదించడం మంచిది. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

