ఆస్తమాకు చెక్.. వారంలో 2 సార్లు ఈ ఒక్క గ్లాసు చాలు!
ఒకప్పుడు కివీ పండు అంటే ఎక్కడో పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లలో మాత్రమే కనిపించేది. కానీ ఇప్పుడు మన వీధి చివర పండ్ల బండి మీద కూడా చాలా విరివిగా దొరుకుతోంది. ఇన్ని పోషకాలున్న ఈ పండును మనం అస్సలు వదులుకోకూడదు. వారానికి కనీసం రెండుసార్లైనా కివీ జ్యూస్ తాగితే మన శరీరానికి ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలు అందుతాయి.
జ్యూస్ ఎలా చేసుకోవాలి?
ఇది చాలా సింపుల్ అండీ! ఒక కివీ పండు తీసుకుని, పైన చెక్కు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని మిక్సీలో వేసి, ఒక కప్పు నీళ్లు పోసి మెత్తగా బ్లెండ్ చేయండి. ఆ జ్యూస్‌ను ఒక గ్లాసులోకి తీసుకుని, కాస్త తీపి కోసం ఒక స్పూన్ తేనె కలుపుకుంటే… టేస్టీ అండ్ హెల్తీ కివీ జ్యూస్ రెడీ!

దీనివల్ల లాభాలు ఏంటంటే..
ఇమ్యూనిటీ బూస్టర్: ఇందులో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో రోగనిరోధక శక్తిని అమాంతం పెంచి, చిన్నచిన్న జబ్బులు మన దరిచేరకుండా కాపాడుతుంది.
గుండెకు భరోసా: కివీలో పొటాషియం, మెగ్నీషియం ఉండటం వల్ల ఇది బీపీ (రక్తపోటు) ని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే రక్తంలో చెడు కొవ్వులను (ట్రైగ్లిజరైడ్స్) తగ్గించి, గుండె పదిలంగా ఉండేలా చేస్తుంది.
జీర్ణ సమస్యలకు చెక్: ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. గ్యాస్, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి ఇబ్బందులు ఉన్నవారికి ఇది చాలా మంచి ఔషధంలా పనిచేస్తుంది.
కంటి చూపు మెరుగు: ఇందులోని రకరకాల విటమిన్లు కంటి ఆరోగ్యాన్ని కాపాడి, ఫ్యూచర్లో కంటి సమస్యలు రాకుండా చేస్తాయి.
ఊపిరితిత్తుల ఆరోగ్యానికి: వాతావరణం మారినప్పుడు వచ్చే దగ్గు, గొంతు నొప్పి, ఇన్ఫెక్షన్లను ఇది ఇట్టే తగ్గిస్తుంది. ముఖ్యంగా ఆస్తమా, శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారికి కివీ జ్యూస్ మంచి ఉపశమనం ఇస్తుంది. ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడమే కాకుండా, పిల్లల్లో వచ్చే గురక సమస్యను కూడా ఇది తగ్గిస్తుంది.
నొప్పుల నుండి ఉపశమనం: ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు, విటమిన్ ‘ఇ’, పాలీఫెనాల్స్.. కీళ్ల నొప్పులు మరియు ఇతర శరీర నొప్పులను తగ్గిస్తాయి.
హాయిగా నిద్రపట్టడానికి: రాత్రి పూట నిద్రపట్టక ఇబ్బంది పడేవారు (నిద్రలేమి సమస్య) కచ్చితంగా కివీ జ్యూస్ ట్రై చేయొచ్చు. ఇందులోని సెరోటోనిన్, యాంటీ ఆక్సిడెంట్లు మీ మనసును ప్రశాంతంగా ఉంచి, హాయిగా నిద్ర పట్టేలా చేస్తాయి.
చూశారుగా, ఒక చిన్న కివీ పండులో ఎన్ని అద్భుతమైన లాభాలు ఉన్నాయో! ఇంకెందుకు ఆలస్యం, ఈసారి పండ్ల దుకాణానికి వెళ్ళినప్పుడు కివీలను కచ్చితంగా తెచ్చుకోండి.
గమనిక: ఈ ఆర్టికల్‌లో ఇచ్చిన సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందించబడ్డాయి. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్‌ను సంప్రదించడమే ఎప్పటికీ ఉత్తమం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

