పిల్లలకైనా, పెద్దలకైనా.. ఈ 1 స్పూన్ పొడితో జ్ఞాపకశక్తి అమాంతం పెరుగుతుంది!
ఈ రోజుల్లో ఉరుకుల పరుగుల జీవితం, పని ఒత్తిడి, ఆందోళన వల్ల మన మెదడు చాలా త్వరగా అలసిపోతోంది. దీనివల్ల చిన్న వయసులోనే మతిమరుపు రావడం, ఏ పని మీదా ఏకాగ్రత పెట్టలేకపోవడం లాంటి సమస్యలు చూస్తున్నాం.
మెదడు ఎంత చురుగ్గా ఉంటే మనం అంత యాక్టివ్గా, ఆరోగ్యంగా ఉంటాం కదా! అందుకే, మెదడుకు కావాల్సిన పోషకాలను అందించి, జ్ఞాపకశక్తిని పెంచే ఒక అద్భుతమైన పొడిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు:
బాదం పప్పులు – 1 కప్పు
వాల్నట్స్ (ఆక్రోట్) – అర కప్పు
సోంపు – 2 స్పూన్లు
బెల్లం పొడి – 4 స్పూన్లు

ఎలా తయారు చేయాలి?
ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని, అందులో బాదం పప్పులు వేసి దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.ఆ తర్వాత అదే పాన్లో వాల్నట్స్ కూడా వేసి కాస్త వేయించి తీసుకోవాలి.
ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని.. అందులో వేయించి పెట్టుకున్న బాదం, వాల్నట్స్, అలాగే 2 స్పూన్ల సోంపు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోవాలి.చివరగా అందులో 4 స్పూన్ల బెల్లం పొడి వేసి మరోసారి మిక్సీ చేస్తే.. బ్రెయిన్ హెల్త్ పౌడర్ రెడీ!
ఈ పొడిని తడి లేని ఒక గాజు సీసాలో పోసి నిల్వ చేసుకుంటే దాదాపు 15 రోజుల వరకు పాడవకుండా ఉంటుంది.
ఎలా వాడాలి?
ఉదయం బ్రేక్ఫాస్ట్ చేయడానికి ముందు కానీ, లేదా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కానీ ఒక గ్లాసు గోరువెచ్చని పాలలో ఈ పొడిని ఒక స్పూన్ కలుపుకుని తాగాలి.
దీనివల్ల లాభాలు ఏంటి?
ఇలా ఒక పది రోజుల పాటు క్రమం తప్పకుండా ఈ పాలను తాగితే మీకే మంచి తేడా తెలుస్తుంది. మెదడు పనితీరు మెరుగుపడి, మతిమరుపు సమస్యలు తగ్గిపోతాయి. మీరు చేసే ఏ పని మీదైనా ఏకాగ్రత (Focus) పెరుగుతుంది. ఆందోళన, ఒత్తిడి లాంటివి దూరమై రోజంతా చాలా హుషారుగా ఉంటారు.
దీన్ని చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు ఎవరైనా నిశ్చింతగా తీసుకోవచ్చు. ముఖ్యంగా చదువుకునే పిల్లలకు రోజుకి ఒక గ్లాసు ఇస్తే వాళ్ల జ్ఞాపకశక్తి చాలా బాగా పెరుగుతుంది. కాస్త ఓపిక చేసుకుని ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే మీ ఇంటిల్లిపాది మెదడు ఆరోగ్యానికి డోకా ఉండదు!
గమనిక: ఈ ఆర్టికల్లో అందించిన సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే డాక్టర్ను సంప్రదించడమే ఎప్పటికీ ఉత్తమం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

