15 నిమిషాల్లో మ్యాజిక్.. ముఖం కాంతివంతంగా, తెల్లగా మెరవాలంటే ఇది రాయండి!
రోజువారీ పనుల ఒత్తిడి, కాలుష్యం వల్ల మన ముఖం ఒక్కోసారి గ్లో కోల్పోయి బాగా డల్ గా కనిపిస్తుంటుంది. దానికి తోడు మొటిమలు, వాటి తాలూకు నల్లటి మచ్చలు అందాన్ని మరింత తగ్గిస్తుంటాయి.
వీటి కోసం బ్యూటీ పార్లర్ల చుట్టూ తిరిగి, రకరకాల క్రీమ్స్ వాడి విసిగిపోయారా? అయితే మీకోసం ఒక సూపర్ సింపుల్ హోమ్ రెమెడీ ఉంది. మన వంటగదిలో ఉండే వస్తువులతోనే, పెద్దగా ఖర్చు లేకుండా మెరిసే చర్మాన్ని మీ సొంతం చేసుకోవచ్చు.
దీనికోసం కావాల్సినవి మూడే మూడు:
టమాటా రసం – అర చెక్క (సగం టమాటా)
తేనె – 1 స్పూన్
కస్తూరి పసుపు – పావు స్పూన్

ఎలా వాడాలంటే..
ఒక చిన్న బౌల్ తీసుకుని అందులో టమాటా రసం, తేనె, కస్తూరి పసుపు వేసి అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు ఈ పేస్ట్‌ను ముఖానికి ప్యాక్ లాగా అప్లై చేసుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు అలాగే ఆరనిచ్చి, ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి.
దీనివల్ల లాభాలు:
ఇలా వారానికి కనీసం రెండు సార్లు ట్రై చేసి చూడండి. మొటిమలు, నల్ల మచ్చలు క్రమంగా తగ్గిపోయి మీ ముఖం మళ్లీ కాంతివంతంగా, అందంగా మెరుస్తుంది. దీనికోసం మీరు వేలకు వేలు ఖర్చు చేయాల్సిన అవసరం లేదు, రోజులో మీ అందం కోసం కేవలం ఒక పావుగంట కేటాయిస్తే చాలు!
గమనిక: ఈ ఆర్టికల్‌లో అందించిన సమాచారం, సూచనలు కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. మీకు చర్మ సంబంధిత ఎలర్జీలు (సెన్సిటివ్ స్కిన్) ఏవైనా ఉంటే ముందుగా డెర్మటాలజిస్ట్‌ను లేదా డాక్టర్‌ను సంప్రదించడం మంచిది. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

