Beauty TipsHealthhealth tips in telugu

HealthTips:నిత్య జీవితంలో ఉపయోగపడే ఆరోగ్య చిట్కాలు

Kitchen And Health Tips:బొప్పాయి సన్ తాన్ తొలగించటానికి సహాయపడుతుంది. బొప్పాయి గుజ్జును ముఖానికి పట్టించి పది నిమిషాల పాటు మసాజ్ చేసి బాగా ఆరాక చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తూ ఉంటే సన్ తాన్ తొలగిపోతుంది

ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో రెండు స్పూన్ల ఆపిల్ సైడర్ వెనిగర్ వేసి త్రాగితే గ్యాస్ సమస్య నుండి ఉపశమనం కలుగుతుంది.

మైగ్రైన్ తలనొప్పి నివారణ
కాఫీ త్రాగటం వలన మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఇందులోని కెఫిన్ నొప్పిని కలిగించే రిసెప్టర్లను నిరోధించి రక్తనాళాలను నియంత్రిస్తుంది. ఇందులో కొద్దిగా నిమ్మరసం కలుపుకోని త్రాగితే ఇంకా ప్రభావితంగా పనిచేస్తుంది.

పాదాల పగుళ్ళకు పండ్లతో మసాజ్
బాగా మాగిన అరటి పండు లేదా బొప్పాయి పండును మాష్ చేసి పగిలిన పాదాలపై రాసి 10 నిమిషాల పాటు మసాజ్ చేయాలి. ఆ తరువాత పావుగంట అయ్యాక చల్లని నీటితో కడగాలి. ఇలా ప్రతి రోజు చేస్తూ ఉంటే పాదాలకు కావలసిన తేమ పదార్థం అందుతుంది దాంతో పగుళ్లు తగ్గుతాయి.

పాదాలపై బొబ్బలు తగ్గాలంటే
కలబంద లో శోథనిరోధక లక్షణాలు ఉన్నాయి. కలబంద జెల్ ని డైరెక్ట్ గా పొక్కుపై రాయండి. ఇది రెడ్నస్ ని తగ్గించి నొప్పి నుండి తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."