Politics

జగన్ దూకుడు తో చుక్కలు లెక్కపెడ్తున్న టిడిపి…. పరిస్థితి ఎలా ఉందో?

గత ఎన్నికల్లో కేవలం 2శాతం లోపు ఓట్ల తేడాతో రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన వైస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్ ఈసారి ఎలాగైనా సరే అధికార పగ్గాలు చేపట్టాలని కసి గా పనిచేస్తున్నాడు. తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ లో ఏర్పడిన పరిణామాల నేపథ్యంలో ఆ పార్టీని వదిలిపెట్టి సొంతంగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టాడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ నెమ్మదిగా పుంజుకుని ఇప్పుడు రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారం జగన్ దే అనే రీతిలో ఎదిగాడు. సర్వేలు కూడా జగన్ కి అనుకూలంగా ఉన్నాయి.

జగన్ 1972డిసెంబర్ 21జన్మించాడు. వైస్సార్ రాజకీయాల్లో ఉండడంతో జగన్ బాల్యం అంతా హైదరాబాద్ లోనే గడిచింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో ప్లస్ 2వరకూ చదివి,నిజాం కాలేజీలో డిగ్రీ దాకా చదివాడు. స్కూల్ డేస్ నుంచి సినీ నటుడు సుమంత్ ,జగన్ క్లాస్ మేట్స్ , వీళ్ళ ఫ్రెండ్ షిప్ ఇప్పటికీ చెక్కుచెదరలేదు. డాక్టర్ వైఎస్ వైద్య విద్యను అభ్యసించే సమయంలో ఆయన ఫ్రెండ్ అయిన సుగుణా రెడ్డి కోరిన కోరిక మేరకు మాట నిలబెట్టుకుంటూ డాక్టర్ వైఎస్, తనకొడుక్కి సుగుణా రెడ్డి కూతురిని చేసుకున్నాడు.

అలా భారతితో వివాహమైన జగన్ దంపతులకు హర్ష , వర్ష అనే ఇద్దరు అమ్మాయిలున్నారు. జగన్ కుమార్తె లండన్ లోని ఎకనామిక్స్ స్కూల్ లో చదువుతోంది.ఇక డాక్టర్ వైఎస్ ఉన్న సమయంలోనే సాక్షి పేపర్,సాక్షి ఛానల్ ప్రారంభించి మీడియా రంగంలో జగన్ సంచలనం రేపారు. వైస్సార్ మరణంతో అక్రమాస్తుల కేసులో సీబీఐ అరెస్టు చేసి జగన్ ని జైలుకి పంపించింది. 16మాసాలు చెంచల్ గుడా జైలులో గల జగన్ ప్రస్తుతం బెయిల్ పై వచ్చి వారం వారం నాంపల్లి సీబీఐ కోర్టుకి హాజరవుతున్నారు.

ఇదే క్రమంలో వైజాగ్ ఎయిర్ పోర్టులో కోడి కత్తితో దాడి జరిగింది. తగిలింది చిన్న గాయమైనా సరే,సెన్షేషన్ క్రియేట్ చేసింది. రాజకీయ అనుభవం పెద్దగా లేని తల్లీ, చెల్లి ఓ వైపు , మరోవైపు ఆదుకునే వాళ్ళు లేకపోగా గుండెధైర్యంతో నెట్టుకొచ్చి వైకాపాను నిలబెట్టాడు జగన్. ఓ వైపు వ్యాపారం,మరోవైపు రాజకీయాలు బాలన్స్ చేస్తూ, వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.

నేషనల్ మీడియాకు ఎక్కువగా ఇంటర్యూలు ఇచ్చే జగన్,పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. డాక్టర్ వైఎస్ అప్పట్లో పాదయాత్ర చేసినట్లే జగన్ కూడా ఇటీవల రాష్ట్రమంతటా పాదయాత్ర చేసి ప్రజల్లో విపరీతమైన అభిమానం సంపాదించుకున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."