Womens Day

ఫ్లిప్‌కార్ట్.. మహిళా దినోత్సవం ఆఫర్లు

మార్చ్ 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ-కామర్స్‌ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌ మార్చి 7, 8 తేదీల్లో భారీ డిస్కౌంట్ సేల్‌ను ప్రకటించింది. ఇండియూలో భాగంగా హానర్‌ 9ఎన్, నోకియా 6.1 ప్లస్‌, శాంసంగ్‌ గెలాక్సీ నోట్‌ 8, వివో వి9 ప్రో, మోటో వన్‌ పవర్‌ మోడళ్లపై భారీగా డిస్కౌంట్లు అందించనుంది. అంతేకాకుండా లాప్‌టాప్స్‌, హెడ్‌ఫోన్స్‌, స్పీకర్స్‌, కెమెరాలు, పవర్ బ్యాంక్స్‌పై 80 శాతం వరకు భారీ డిస్కౌంట్‌ను అందించనుంది. కొన్ని ఎంపిక చేసిన బ్యాంకింగ్‌ నెట్‌వర్క్‌ల ద్వారా నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం కూడా కల్పిస్తోంది.

ఈ సేల్‌లో భాగంగా రూ.11,999గా ఉన్న హానర్ 9ఎన్‌ రూ. 9,999కే లభించనుంది. రూ.15,499గా ఉన్న నోకియా 6.1 ప్లస్‌ రూ.13,999, వివో వి9 ప్రోపై రూ.2000 డిస్కౌంట్‌తో రూ.13,990 కి కొనుగోలు చేసుకోవచ్చు. అంతేకాకుండా వివో వి9 ప్రోపై ఎక్స్ఛేంచ్‌ ఆఫర్‌ కింద మరో రూ. 1500 డిస్కౌంట్‌ పొందే అవకాశాన్ని కల్పించింది. శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌8 రూ.30,990కే పొందవచ్చు.

జెన్‌ఫోన్ లైట్‌ ఎల్1 అత్యధికంగా రూ.4,999 డిస్కౌంట్‌పై లభించనుంది. రూ.71,000గా ఉన్న 64 జీబీ గూగుల్‌ పిక్సెల్‌ 3 విమెన్స్‌ డే సేల్‌లో భాగంగా రూ.59,999 నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ సేల్‌ జరుగుతున్న రెండు రోజులు ప్రతి ఎనిమిది గంటలకు ఒకసారి బ్లాక్‌బస్టర్‌ డీల్స్, ప్రతి గంటకొకసారి ఓమైగాడ్‌ డీల్స్‌ నిర్వహించనున్నట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."