జయసుధ,జయప్రద జీవితంలో ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసా?
తెలుగు చిత్రసీమలో ఎందరో హీరోలు,హీరోయిన్స్ వచ్చినా కొందరు తమదైన ముద్ర వేస్తుంటారు. అందులో జయసుధ,జయప్రదలను చెప్పుకోవాలి. అందం అభినయం జోడించి జయప్రద,సహజత్వంగా నటించి జయసుధ ఆడియన్స్ కి దగ్గరయ్యారు. అయితే వీళ్ళిద్దరూ తమ భర్తల ద్వారా ఘోరంగా ఓడిపోయి కష్టాల పాలయ్యారు. ఎన్టీఆర్ తో విశ్వరూపం మూవీలో ఉండగా అసిస్టెంట్ డైరెక్టర్ గా చేసిన జితేంద్ర కజిన్ నితిన్ కపూర్ కనిపించడంతో మనసు పారేసుకుంది. ఇక నితిన్ ని గాఢంగా ప్రేమించి పెళ్లాడారు. వీరికి ఇద్దరు పిల్లలు. డైరెక్షన్ రంగంలో కొన్ని ప్రయత్నాలు చేసిన నితిన్ ని ఎంకరేజ్ చేయడానికి జయసుధ కొన్ని సినిమాలు తీశారు.

మొదట్లో బానే ఉన్నా ఆతర్వాత నితిన్ డైరెక్ట్ చేసిన సినిమాలు ప్లాప్ అయ్యాయి.అలా జయసుధ దంపతులు దురదృష్టం కొని తెచ్చుకున్నారు. ఇక హ్యాడ్సప్ మూవీతో పూర్తిగా దెబ్బతిన్నారు. తీవ్రంగా అప్పుల్లో కూరుకుపోయిన జయసుధ ఇక నగలు తనకు వద్దు అనేంతగా వైరాగ్యంలోకి వెళ్ళిపోయింది. లక్షలు కళ్లచూసిన ఆమె కేవలం 5వేలరూపాయలకు నానా కష్టాలు పడాల్సి వచ్చింది. ఇక క్రైస్తవం నమ్ముకుంటే మంచి జరుగుతుందని భావించి ఆదిశగా అడుగులేసిన జయసుధను అదే సమయంలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆమెను కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.

సికింద్రాబాద్ స్థానం నుంచి 2009లో జయసుధ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. మరోవైపు కొన్ని క్రైస్తవ మిషనరీ నిధులిప్పించడంతో ఆర్ధికంగా నిలదొక్కుకున్నారని అంటారు. ఈమధ్య టిడిపిలో చేరిన జయసుధ మళ్ళీ తాజాగా వైస్సార్ కాంగ్రెస్ గూటికి చేరారు.

ఇక జయప్రద విషయం తీసుకుంటే,భర్త చేసిన మోసానికి బలయ్యారు. ఆపరేషన్ చేయించుకుని మరీ పెళ్లి చేసుకుని, మాతృత్వానికి దూరం అయ్యారు. మేఘసందేశం మూవీ సమయంలో జయప్రద,జయసుధ సరదాగా పేకాట ఆడారట. అప్పుడు జయప్రద 70రూపాయలు పోగొట్టుకున్నారట. దాంతో ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారట.

అంతటి సున్నిత మనస్తత్వం ఆమెది. మొత్తానికి రాటుదేలిన జయప్రద రాజకీయాల్లో తన సత్తా చాటారు. టిడిపిలో రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికైన ఆమె,ఆతర్వాత యూపీ వెళ్లి లోక సభకు సమాజ్ వాదీ పార్టీ నుంచి పోటీచేసి రెండు సార్లు ఎన్నికయ్యారు. రాజమండ్రిలో పుట్టి,చిత్ర రంగానికి వెళ్లి అటునుంచి టిడిపి రాజకీయాల్లో కి వెళ్లి అక్కడ నుంచి సమాజ్ వాదీ పార్టీ లో చేరి, రామ్ పూర్ నుంచి ఎంపీగా ఎన్నికైన ఘనత ఆమెది. ప్రస్తుతం అజిత్ సింగ్ రాష్ట్రీయ లోక్ దళ్ కి పనిచేస్తున్నారు.

