అతిలోక సుందరికి వంద కోట్ల ప్యాలస్ ఇచ్చింది ఎవరో తెలుసా ?
బూచాడమ్మా బూచోడు అంటూ బాలనటిగా చేసి,పలు చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసి,16ఏళ్ళ ప్రాయంలో 16ఏళ్ళ వయస్సు మూవీతో హీరోయిన్ గా అటు తమిళ,ఇటు తెలుగు భాషల్లో నటించి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన శ్రీదేవి అతిలోక సుందరి గా ఆడియన్స్ గుండెల్లో నిల్చింది. దక్షిణాది భాషల్లో ఓ ఊపు మోపిన శ్రీదేవి బాలీవుడ్ లో సైతం తన చరిష్మా చాటింది. ఇక ఆరోజులలో శ్రీదేవి అంటే పడిచచ్చే ఎందరో వీరాభిమానులున్నారు. తెరమీద డైరెక్టర్ చెప్పినట్టు చేసే శ్రీదేవి తెరవెనుక మాత్రం ఏది తినాలన్నా, ఏది తాగాలన్నా, చివరకు మాత్ర వేసు కోవాలన్నా సరే ఆమెకు తల్లి చెప్పిందే వేదం. ఆమె మాట జవదాటదు. ఇక చిన్ననాటి నుంచి మద్య్హపానానికి కూడా ఎడిట్ చేసింది.

అయితే ఆమె జీవితంలో ఎన్నో చీకటి కోణాలు ఉన్నాయని అంటారు. అన్నీ వదులుకుని బాలీవుడ్ లోకి అడుగుపెట్టడంతో ఆమె ఒంటరి గా మారిందని చెబుతారు. హిట్ మీద హిట్ కొడుతూ తారాస్థాయికి చేరుకున్న శ్రీదేవిని అదేసమయంలో వ్యక్తిగతంగా అధః పాతాళానికి దిగజార్చేసాయి. ఆమె తల్లికి ఆపరేషన్ అవ్వడం అది కాస్తా బెడిసి కొట్టడంతో అదే కేసు అయింది. అయితే ఆకేసులో డబ్బులు మాట అటుంచి, అదే సమయంలో బోనీ కపూర్ పరిచయం అయ్యాడు.

పెళ్లయి పిల్లలున్న యితడు అప్పటికే నిండా అప్పులపాలయ్యాడు. అతడి అవసరాలకు ఆమె అడ్డాగా భావించి ఆమె జీవితంలోకి ప్రవేశించి ఆమెను పూర్తిగా ఆక్రమించాడు. ఇక పెళ్లి దాకా వెళ్లడంతో బోనీ ముందు భార్య , పిల్లలు ఆమెపై దాడికి తెగబడ్డారు. అయినా మొండిగా నిలబడిన శ్రీదేవి చివరకు బోనీకపూర్ ని పెళ్లిచేసుకుంది. మరోపక్క సవతి తండ్రి అయ్యప్పకు, తల్లి రాజేశ్వరికి పుట్టిన లత పెట్టె వేధింపులు అన్నీ ఇన్నీ కావట. బోనీకపూర్ అప్పులు ఓవైపు,వయస్సుకి ఎదిగిన ఇద్దరు కూతుళ్ళ బాధ్యతలు మరోవైపు ఇలా శ్రీదేవి సతమతం అయింది.

తనకున్న సమస్యలను మర్చిపోవడానికి ఫుల్లుగా తాగి,చివరకు ఆ మత్తులోనే ఆమె జారిపడి చనిపోవడం జరిగింది. పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా ఇదే చెబుతోంది. ఇక ఆమెకున్న 200కోట్ల రూపాయల బీమా కోసమే ఇదంతా చేసారన్న టాక్ కూడా వైరల్ అయింది. నిజానికి శ్రీదేవి తమతో మాట్లాడితే చాలని ఇంటిముందు ఎందరో పడిగాపులు కాసేవారు. ఇక దుబాయ్ షేక్ అయితే శ్రీదేవి తనతో మాట్లాడితే చాలు ఇచ్చేస్తా అంటూ వందకోట్ల విలువైన సరస్వతి మహల్ అనే ఓ ఇంటిని కొనేసి పేపర్స్ తెచ్చాడు.

అంతటి వీరాభిమానులు శ్రేదేవి సొంతం. ఇక కొందరు అభిమానులైతే రాత్రి కలలోకి వచ్చారు మీరు ఈ చెక్ తీసుకోండి అంటూ వెయ్యి రూపాయల చెక్ రాసి, ఆరోజుల్లో పంపేవారట. అంతటి క్రేజీ హీరోయిన్ గా శ్రేదేవి హవా నడిచింది. అయితే బోనీ కపూర్ మాయలో పడి తన సర్వస్వాన్ని కోల్పోయింది. నెలకు పాతిక లక్షలు వడ్డీ కట్టేంత జల్సా చేసి,తన దివాలాకోరు తనం బోనీ చాటుకున్నాడు. అందుకే శ్రీదేవి ఉక్కిరి బిక్కిరి అయిందట.

