Movies

మొన్న చిరంజీవి.. ఇపుడు పవన్.. అలా ఎందుకు చేశారో?

ఎన్నికలు ముగిసిన తర్వాత అన్నయ్య చిరంజీవి ఏమైతే చేసాడో, ఇపుడు పవన్ కళ్యాణ్ అదే పని చేసాడు. కొన్నేళ్ల క్రితం వరకు చిరంజీవి రాజకీయాలతో బిజీగా ఉంటే, పవన్ కళ్యాణ్ సినిమాలతో తీరిక లేకండా ఉండేవారు. కానీ ఇపుడు సీన్ రివర్స్ అయింది. ఇపుడు మెగాస్టార్ మాత్రం..వరుస సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాడు. మరోవైపు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే ఎన్నికల ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏప్రియల్ 11న పోలింగ్ ముగియడంతో హైదరాబాద్ లో ప్రశాంతంగా విశ్రాంతి తీసుకుంటున్నాడు.ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగియడం, ఫలితాల కోసం నెలన్నరకు పైగా టైమ్ ఉండడంతో మొన్నటి వరకు ఎన్నికల ప్రచారంతో ఫుల్ బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇక సేద తీరుతున్నాడు.

తాజాగా తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన ‘చిత్రలహరి’ సినిమా చూసాడు . సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శిని,నివేథా పెతురాజ్‌లు హీరోయిన్స్‌‌గా నటించారు. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్న సినిమా నిర్మాతలకు డిస్ట్రిబ్యూటర్స్‌కు లాభల పంట పండించింది. ఇప్పటికే ఈ సినిమా ఓవరాల్‌గా రూ.20 కోట్ల గ్రాస్, రూ.14 కోట్ల షేర్ రాబట్టినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.మొత్తానికి ‘చిత్రలహరి’ సక్సెస్.. మైత్రి మూవీ మేకర్స్‌తో పాటు ఈ సినిమాలో నటించిన ప్రతి టెక్నీషియన్ కెరీర్‌కు ప్రాణం పోసింది.

Chiru – MLA from Tirupathi Constituency

ఇక ఈ మూవీని పవన్ చూడటమే కాదు. ఈ సినిమాతో తిరిగి సక్సెస్ ట్రాక్ ఎక్కిన సాయి ధరమ్ తేజ్‌కు ప్రశంసలు కురిపించాడు. అంతటితో సరిపెట్టకుండా మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లకు ఒక బొకే పంపించాడు. అంతకంటే ముందు చిరంజీవి కూడా ‘చిత్రలహరి’ సినిమా చూసి సాయి ధరమ్ తేజ్‌నటనను మెచ్చుకున్నాడు. మరోవైపు చిత్రం సక్సెస్ అయిన సందర్భంగా చిత్ర దర్శక,నిర్మాతలకు అభినందనలు తెల్పాడు.