Movies

ఎదురులేని మనిషి సినిమాలో నాగార్జున కూతురిగా నటించిన ఈ పాప ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా?

చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టుగా నటించి బాగా ఆకట్టుకున్న వాళ్ళు పెద్దయ్యాక స్టార్స్ రాణించవచ్చు . ఆకట్టుకోలేక పోవచ్చు. ఏదైనా జరగొచ్చు. ఇప్పుడు మనం చెప్పబోయే హీరోయిన్ కూడా అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఆమె సుహాని . ఈమె స్టార్ హీరో నాగార్జునకు కూతురుగా నటించింది. ఎదురులేని మనిషి మూవీలో నటించిన ఈమె దాదాపు 40సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా నటించి మంచి పేరు తెచ్చుకుంది. మనసంతా నువ్వే వంటి సినిమాల్లో సుహాని నటన అదరగొట్టింది. ప్రేమించే మనసు, ప్రేమంటే ఇదేరా,గణేష్ వంటి సినిమాల్లో తన అద్భుత నటనతో చిన్నప్పుడు ఎంతో పాపులారిటీ తెచ్చుకున్న ఈమె బెంగాలీ కుటుంబానికి చెందింది.

Suhani Sharma

హీరో మహేష్ బాబు అంటే ఎంతో ఇష్టపడే ఈమె పెద్దయ్యాక హీరోయిన్ గా రాణించాలని చేసిన ప్రయత్నం బెడిసికొట్టింది.శ్రీశైలం,స్నేహగీతం,సుకుమార్ వంటి తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా వేసిన సుహాని ఎందుకో ఆకట్టుకొలేకపోయింది. హీరోయిన్ గా కంటే చైల్డ్ ఆర్టిస్టుగానే సుహాని బాగా క్లిక్ అయింది. పెద్దయ్యాక 27ఏళ్ళ వయస్సులో అందంగా బొద్దుగా ఉన్నప్పటికీ హీరోయిన్ గా సక్సెస్ అందుకోలేకపోయింది. మరి మహేష్ బాబుతో నటించాలన్న కోరిక ఈమెకు తీరుతుందో లేదో చూడాలి.