అర్జున్ రెడ్డి ని మిస్ చేసుకున్న భామ…ఎవరో తెలుసా?
అర్జున్ రెడ్డి సినిమా గురించి తెలియని వారు ఎవరు లేరు. ఎందుకంటే ఆ సినిమా అంతటి ఘన విజయాన్ని సాధించింది. అంతేకాక టాలీవుడ్ లో ఒక సంచలనం సృష్టించింది. దీనితో ఈ సినిమాలో హీరో, హీరోయిన్ గా నటించిన విజయ్ దేవరకొండ, షాలినీ పాండే రాత్రి రాత్రికి స్టార్స్ అయ్యిపోయారు. సినిమాని కొంచెం బోల్డ్ గా తీయటం వలన తమిళం, హిందీలలోనూ కూడా ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. షాలినీ పాండే ఒక పక్క టాలీవుడ్ మరో పక్క కోలీవుడ్ లోను వరుస అవకాశాలతో చాలా బిజీగా ఉంది.
అయితే ఈ సినిమా అవకాశం మొదట మరో హీరోయిన్ దగ్గరకు వెళ్లిందట. అయితే సినిమాలో కాస్త బోల్డ్ గా ఉండటంతో ఆ హీరోయిన్ సినిమా చేయటానికి దైర్యం చేయలేక వెనకడుగు వేసిందట. ఆమె ఎవరో కాదు… మలయాళ నటి పార్వతీ నాయర్.
ఆమె కథ విని భయపడిందట. అయితే ఈ సినిమా ఘన విజయం సాధించటం…విజయ్ దేవరకొండ, షాలినీ పాండేలకు విపరీతమైన క్రేజ్ రావటంతో ఆ సినిమాను మిస్ చేసుకున్నందుకు చాలా బాధ పడుతుందట. అంతేకాక ఆ సినిమా అంత హిట్ అవుతుందని అసలు ఉహించలేదట. అయినా ఇప్పుడు బాధపడి ఏమి లాభం. జరగాల్సిన నష్టం జరిగిపోయింది.

