స్టార్ హీరోయిన్స్ అభిమాన హీరోలు ఎవరో తెలుసా?
ప్రేక్షకులకు అభిమాన హీరో ఉన్నట్టే మన స్టార్ హీరోయిన్స్ కి కూడా అభిమాన నటులు ఉన్నారు. మన టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ కి ఏ స్టార్ హీరో అంటే అభిమానమో తెలుసుకుందాం. ఇప్పుడు అనుష్క,సాయి పల్లవి,రకుల్ ప్రీత్ సింగ్,కాజల్, నివేదా థామస్ ఈ స్టార్ హీరోయిన్స్ ఏ స్టార్ హీరో అంటే ఇష్టమో చూద్దాం.
- మొదటగా అనుష్క విషయానికి వస్తే… ఆమెకు ప్రభాస్ అంటే చాల ఇష్టం. ఇద్దరూ కలిసి 5 సినిమాలు చేసారు.
- సాయి పల్లవికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే పిచ్చ అభిమానం. ఆమె ధియేటర్ లో గబ్బర్ సింగ్ సినిమా చూసి పవన్ కి ఫిదా అయింది సాయి పల్లవి.
- రకుల్ ప్రీత్ సింగ్ అభిమాన నటుడు మహేష్ బాబు. మహేష్ బాబుతో కలిసి స్పైడర్ సినిమాను చేసింది.
- కాజల్ కి అభిమాన నటుడు మన్మధుడు నాగార్జున. అయితే కాజల్ కి నాగార్జునతో కలిసి నటించే అవకాశం రాలేదు.
- నివేదా థామస్ అభిమాన హీరో ఎన్టీఆర్. జై లవ కుశ సిమాలో తారక్ నటనని చూసి ఫిదా అయిపోయిందట.
