Health

యువత నిద్రకు దూరమవ్వడానికి అసలు కారణాలు ఇవే.. జాగ్రత్తగా ఉండండి

చాలా మంది వివిధ రకాల పనుల ఒత్తిడి కారణంగా నిద్రకు దూరమవుతున్నారు. ఆలోచనలు, కుటుంబ సమస్యలు, కార్యాలయాల్లో పని ఒత్తిడి కారణంగా విపరీతంగా ఆందోళనకు గురవుతుంటారు. దాన్ని నిర్లక్ష్యం చేస్తే గనుక ఇంకా కుంగిపోవడం ఖాయం కాబట్టి ఒత్తిడి నుంచి ఎలా బయటపడాలో ఆలోచించాలి.కనీసం గంట నుంచి అరగంట వరకూ నిద్రపోయేలా చూసుకోండి. దాని ఫలితంగా ఆందోళన తగ్గుతుంది. తర్వాత మీరే ఉత్సహంగా ఉంటారు. మీరు స్నేహితులతో కాసేపు గడిపి చూడండి ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.

మీరు బాగా ఆనందంగా ఉన్న సందర్భాలనూ, సానుకూలంగా స్పందించిన పరిస్థితులూ ఊహించుకోండి. దాంతో మీ ఆలోచనా ధోరణిలో కొంత మార్పు కనిపిస్తుంది. కనీసం 15 నుంచి 20 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలండి. ఇలా చేయడం వల్ల మనసే కాదు శరీరానికీ విశ్రాంతి అందటంతో పాటు ఆందోళన కొంత వరకూ తగ్గుతుంది.కొన్నిసార్లు అనవసరంగా ఊహించుకోవడం వల్ల కూడా ఆందోళన పెరిగిపోతుంది. మీరలా ఊహించుకునేవారైతే ఆ ఆలోచనలు పక్కనపెట్టి ఏదైనా పనిలో పడండి. వీలైనంత ఎక్కువసేపు పనిచేసేలా చూసుకోవడం వలన ఆందోళన ఉండదు.

ఒక్కోసారి సరైన ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా కంగారుగా, ఆందోళనగా అనిపిస్తుంటుంది. అందువలన మీరు మరుసటి రోజూ చేయాల్సిన పనుల్ని ముందే రాసి పెట్టుకోండి. వాటికి ప్రాధాన్యం ఇవ్వండి. ఒకటి రెండు రోజులు మీ దినచర్య నుంచి పూర్తిగా విశ్రాంతి తీసుకుని మీకు బాగా ఇష్టమైన పని చేసేలా చూసుకోవడం వల్ల ఆందోళను దూరం చేస్తుంది.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."