జగన్ మోహన్ రెడ్డి అమ్మఒడి పథకం పొందడం ఎలా?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటినుండి రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నారు. ప్రజల సమస్యలను ఒక్కొక్కటిగా తీరుస్తున్నారు. అమ్మఒడి పథకం తో దారిద్ర్య రేఖకు దిగువ వున్న ప్రతి తల్లికి 15 వేల రూపాయలు అందేలా జగన్ ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు. దీనికి కొన్ని నియమ నిబంధనలను పెట్టారు జగన్ మోహన్ రెడ్డి. రెసిడెన్షియల్ స్కూల్ మరియు కాలేజ్ లలో చదువుతున్న పిల్లలకు సైతం ఈ పథకం అమలు కానుంది. 1 నుండి 12 వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థుల తల్లులకు ఈ పథకం వర్తించనుంది. దీనికి సంబందించిన జీవో 79 ని పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్ విడుదల చేసారు.
ఈ పథకం కుటుంబ పిల్లల సంఖ్యతో సంబంధం లేకుండా వర్తిస్తుంది. వారికీ తెల్ల రేషన్ కార్డు ఉండాలి. ఆ తల్లికి/లబ్ది దారులకు సరైన ఆధార్ కార్డు ఉండాలి. ఈ రేషన్ కార్డు సమాచారాన్ని పలు దశల్లో ద్రువీకరిస్తారు. విద్యార్థులు కనీసం 75 శాతం హాజరు ను కలిగి ఉండాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు,ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు, పెన్షన్ అందుకొనే వాళ్ళు, రిటైర్డ్ ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అర్హులు కాదు. లబ్దిదారులకు పోస్టాఫీసులో సేవింగ్స్ ఖాతా కలిగి ఉండాలి. అర్హులైన అకౌంట్లకు ప్రతి సంవత్సరం జనవరిలో డబ్బు జమ అవుతుంది.