Politics

ఏపీ ప్రజలకు మరో బిగ్ షాక్.. అమ్మఒడి పథకంపై భారీ ఆంక్షలు..!

ఏపీలో ఈ సారి జరిగిన ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో గెలిచి అధికారాన్ని చేపట్టింది. అయితే వైసీపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలలో నవరత్నాల హామీలే ప్రధాన కారణం. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చకా ఆ పథకాలలో భారీగా కోతలు ఏర్పడుతున్నాయి. నవరత్న హామీలలో అమ్మబడి పథకం కూడా ప్రధానమైనదే. ఎన్నికల ముందు అమ్మఒడి పథకం కింద ఒక్కో చిన్నారికీ చదువు కోసం ఏటా రూ.15000 ఇస్తామని హామీ ఇచ్చారు జగన్. అయితే వచ్చే ఏడాది జనవరి 26న ఈ పథకాన్ని ప్రారంభించబోతున్నారు.

అయితే ప్రస్తుతం అమ్మఒడి కింద దాదాపు 43 లక్షల మంది తల్లులకు ఈ పథకం అందించాల్సి వస్తుందని అంచనా. అయితే అమ్మ ఒడి పథకం కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.6,455 కోట్లు కేటాయించింది. అయితే ఈ పథకాన్ని తెల్లరేషన్ కార్డ్ ఉన్న వారికి, లేని వారికి కూడా ఈ పథకం వర్తిస్తుందని అధికారులు చెప్పినా ఇప్పుడు ఆర్థిక భారాన్ని దృష్టిలో ఉంచుకుని లబ్ధిదారులను తగ్గించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారట. అయితే తెల్ల రేషన్ కార్డు లేనివారికి కూడా అమ్మఒడి పథకాన్ని అందించాలని జగన్ ఆదేశిస్తే గురుకుల పాఠశాలలు, వివిధ సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు వర్తింపచేయాలా, వద్దా అనేది ఆలోచిస్తున్నారట.

అంతేకాదు ఇన్‌కంటాక్స్ చెల్లిస్తున్నవారు, ఐదెకరాల పొలం ఉన్నవారికి ఈ పథకాన్ని అమలు చేయకూడదని ప్రభుత్వం భావిస్తుందట. ఇకపోతే విద్యార్థులకు 75 శాతం హాజర్ ఉంటేనే ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించుకుందట. అయితే ఇప్పటికే లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్న అధికారులు, సీఎం జగన్ నుంచి లేదా విద్యా శాఖ నుంచీ అధికారికంగా వచ్చే నిర్ణయాన్ని బట్టి ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టు సమాచారం.