Movies

బన్నీ తొలి మూవీ పారితోషికం తెలిస్తే షాక్ అవుతారు

మెగా కుటుంబం నుంచి అల్లు వారి అబ్బాయిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తక్కువ సమయంలోనే తన టాలెంట్ ఏమిటో రుచి చూపించాడు. గొంగోత్రి సినిమాతో దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన యితడు మంచి నటన కనబరిచాడు. అభిమానులు బన్నీగా పిల్చుకునే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా గుర్తింపు పొందాడు. టాప్ హీరోల్లో ఒకడిగా నిలిచి,ప్రస్తుతం అల వైకుంఠపురం లో అనే సినిమాలో చేస్తున్నాడు.

డాన్స్ లు, డైలాగులతో హోరెత్తించే బన్నీ రెమ్యునరేషన్ కూడా టాప్ రేంజ్ లోనే తీసుకుంటాడు. దాదాపు 80కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. అందుకే ఒక్కో సినిమాకు 10కోట్లు రెమ్యునరేషన్ అందుకుంటాడని టాక్. బన్నీ, ఆర్య,ఇలా ఎన్నో వరుస విజయాలతో బన్నీ ఆదినుంచి దూసుకెళ్తున్నాడు. అయితే మొదటి సినిమా గంగోత్రికి ఏ హీరో తీసుకోలేనంత పారితోషికం అందుకున్నాడట. దీని గురించి మాటల్లో చెబితే అందరూ షాకవుతారు.

రాఘవేంద్రరావు వందవ సినిమాగా 2003లో విడుదలైన గంగోత్రి ఘనవిజయం అందుకోవడంతో బన్నీ కెరీర్ కి మంచి బాటలు పడ్డాయి. అయితే తొలి పారితోషికం ఇచ్చింది ఎవరంటే రాఘవేంద్రరావు అట. అవును అతడి డాన్స్ చూసి వాళ్ళ అమ్మకు 100రూపాయలు ఇచ్చానని రాఘవేంద్రరావు ఇటీవల ఈటీవీలో జరిగిన ప్రోగ్రాం లో వెల్లడించారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."