సైరా నరసింహ రెడ్డి సినిమాలోని చిరంజీవి ‘తల్లి’ కూడా ఒకప్పటి హీరోయిన్ ఎవరో తెలుసా ?
సినిమాల్లో పాత్రలు ఒక్కోసారి వింతగా ఉంటాయి. ఎన్ఠీఆర్ ,అక్కినేని ల కన్నా చిన్నవాడైనా సరే,గుమ్మడి వెంకటేశ్వరరావు వాళ్లకు తండ్రిగా, అన్నగా, బాబాయి ఇలా పాత్రలు వేసి బరువైన పాత్రల్లో ఇమిడిపోయారు. ఇలా వయసుకి మించి పాత్రలు వేయడం కూడా ఒక కళే. ఇక ఇప్పుడు విషయానికి వస్తే,వయస్సులో చిన్నదైనా సరే, ఏకంగా మెగాస్టార్ చిరంజీవికి తల్లి పాత్రలో ఒదిగిపోయింది.
సపోర్టింగ్ ఎక్ట్రెస్ గా పలు సినిమాల్లో నటించిన లక్ష్మీ గోపాలస్వామి ఆతరువాత కన్నడం,మలయాళం లలో హీరోయిన్ గా వేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముమ్ముట్టి సరసన మలయాళంలో నటించి మంచి ఇమేజ్ తెచ్చుకుంది. 2000సంవత్సరంలో కన్నడం లో ఆపద్రక్ష సినిమాలో టైటిల్ పాత్ర పోషించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది.
కేవలం ఈమె నటిగానే కాదు,క్లాసికల్ డాన్సర్ గా అంతర్జాతీయ, జాతీయ ప్రదర్శలతో అలరించింది. అలాగే టివి సీరియల్స్ లో కూడా నటించి అవార్డులు అందుకుంది. ఇక ప్రస్తుతం బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో మెగాస్టార్ తల్లిగా వేసింది. చిరంజీవి కన్నా చాలా చిన్నది అయినప్పటికీ తల్లి పాత్రలో ఒదిగిపోయింది. అందుకే సపోర్టింగ్ పాత్రలకు ఎన్నో ఛాన్స్ లు వస్తున్నాయట.