టాలీవుడ్ లో వీళ్ళే అత్యంత దురదృష్టమైన హీరోయిన్స్
జీవితంలో అదృష్టం అనేది ప్రతి ఒక్కరికీ ఏదో ఒకనాడు తలుపు తడుతుంది. అయితే అలా వచ్చిన అదృష్టాన్ని కాలదన్నుకుంటే ఇక మళ్ళీ ఛాన్స్ రాదని అంటారు. అలా మన టాలీవుడ్ లో అదృష్టాన్ని చేజేతులా వదులుకున్నవాళ్ళు వున్నారు. కాలం కలిసిరాకపోతే ,కథను ఊహించుకోవడంలో విఫలమై సినిమాలు వదులుకుని ఆతర్వాత బాధపడతారు. ఎవడు మూవీ రామ్ చరణ్ సరసన సమంత చేయాల్సి ఉంది. కానీ డేట్స్ కుదరకపోవడంతో శృతిహాసన్ ఛాన్స్ ఎగరేసుకుపోయింది.
గబ్బర్ సింగ్ తర్వాత ఎవడు మూవీతో సత్తా చాటిన శృతి ఊపిరి మూవీలో నటించాల్సి ఉన్నప్పటికీ ప్రొడ్యూసర్ తో గొడవ కారణంగా పక్కకు జరిగింది. ఇదే ఛాన్స్ అనుకుంటూ తమన్నా ఆ పాత్రలో ఒదిగిపోయింది. అలాగే రంగస్థలం మూవీలో ఛాన్స్ ని అనుపమ పరమేశ్వరన్ వదులుకుంది. దీంతో సమంత ను ఛాన్స్ వరించి,బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక అర్జున్ రెడ్డి మూవీని హిందీలో తీయగా,అందులో తారా సుతారియా నటించాల్సి ఉండగా ,కాలదన్నుకోవడంతో కియారా అద్వానీ నటించింది.
విజయ్ దేవరకొండ నటించిన బ్లాక్ బస్టర్ గీత గోవిందం మూవీ లో హీరోయిన్ గా రకుల్ ప్రీత్ సింగ్,లావణ్య త్రిపాఠి లాంటి వాళ్లకు ఛాన్స్ వచ్చినా వదులుకున్నారు. చిన్న హీరోతో ఏమిచేస్తాం లే అనుకుని రకుల్ ,లావణ్య కాళ్లదగ్గరకు వచ్చిన ఛాన్స్ ని కాలదన్నుకున్నారు. అను ఇమ్మానియల్ మాత్రం గెస్ట్ రోల్ వేసినా ,క్రెడిట్ మాత్రం రష్మిక తన్నుకుపోయింది.

