చలికాలంలో పాదాల పగుళ్లు వేధిస్తున్నాయా? ఈ ఒక్క చిట్కాతో వెన్నలా మార్చుకోండి!
చలికాలంలో పాదాల పగుళ్లు (Cracked Heels) మిమ్మల్ని వేధిస్తున్నాయా? ఇంట్లో ఉండే వస్తువులతోనే మీ పాదాలను వెన్నలా మృదువుగా మరియు అందంగా ఎలా మార్చుకోవాలో ఈ బ్లాగ్‌లో వివరంగా తెలుసుకోండి. మృదువైన పాదాల కోసం బెస్ట్ వింటర్ టిప్స్.
వింటర్ వచ్చిందంటే చాలు చర్మ సంరక్షణ అనేది కాస్తా కష్టంగానే మారుతుంది. ఇక సమయంలోనే కాలిపగుళ్లు, పాదాలు అందవిహీనంగా మారడం జరుగుతుంది. ఈ సమస్యను కొన్ని ఇంటి చిట్కాలతో సరి చేసుకోవచ్చు. అవేంటంటే..కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా కాలి పగుళ్లు, చారికలు ఏర్పడతాయి.
మరికొంతమందికి చలికాలం వచ్చిందంటే సమస్య ఎక్కువ అవుతుంది. అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఏయే టిప్స్ వాడాలో తెలుసుకుందాం.. కాలి పగుళ్ల సమస్యను నిర్లక్ష్యం చేస్తే వీటి నుంచి రక్తస్రావం అయ్యి ఇబ్బందికి గురయ్యే అవకాశం ఉంది.
రోజూ స్నానం చేసే సమయంలో పాదాలను ప్యూమిన్ స్టోన్‌తో రాయాలి. అనంతరం కొబ్బరి నూనె రాయాలి. ఇలా చేయడం వల్ల పగుళ్ల సమస్య త్వరగా దూరం అవుతుంది.

వారానికి ఓ సారి కాళ్లని ఇంట్లోనే పెడిక్యూర్ చేయాలి. ఇందుకోసం ఓ టబ్‌లో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. ఇందులో ముందుగా ఏదైనా లిక్విడ్ సోప్, డెటాల్, షాంపూని కానీ వేయాలి.. ఇందులో కాళ్లని ఓ పది నిమిషాలు ఉంచి మెత్తటి బ్రష్‌తో క్లీన్ చేసుకోవాలి..
గోర్లని బాగా శుభ్రం చేయాలి. ఒక వేళ కాళ్లు బాగా మురికి పట్టి ఉన్నాయంటే స్క్రబ్ చేసుకోవచ్చు. అందుకోసం కాసింత తేనెలో చక్కెర కాసింత కాఫీ పొడి, రెండు చుక్కల నిమ్మరసం కలిపి మెల్లిగా స్క్రబ్ చేయాలి. ఆ తర్వాత కాళ్లని కడగాలి.
గమనిక:వీటిని పాటించే ముందు తప్పకుండా నిపుణుల సలహా తీసుకోవాలి. ఈ వివరాలు కేవలం మీ అవగాహనకు మాత్రమే. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘chaipakodi’ బాధ్యత వహించదని గమనించగలరు.
Source: chaipakodi.com

