MoviesTollywood news in telugu

శ్రీదేవితో బాలకృష్ణ ఎందుకు నటించలేదు..? కారణం ఇదే..!

BalaKrishna And Sridevi Movies:అప్పట్లో శ్రీదేవికి ఎనలేని క్రేజ్ ఉండేది. స్టార్ హీరోయిన్ గా అప్పట్లో అందరు అగ్ర హీరోలతో నటించింది. రెండవతరం లో చిరంజీవి,నాగార్జున, వెంకటేష్ లతో కూడా చేసింది. అయితే నందమూరి బాలయ్యతో ఎందుకు నటించలేదని అనుకుంటారు. అసలు శ్రీదేవితో బాలయ్య సినిమా లేదేమోనని అనుకుంటారు. కానీ ఎన్టీఆర్ నటించిన హీరోయిన్స్ తో బాలయ్య జోడీ కట్టకూడదని అనుకున్నాడట.
Bala krishna Movies
అందుకే శ్రీదేవితో యాక్ట్ చేయలేదని అనుకుంటారు. నిజానికి ఇది అసలు కారణం కాదు. ఒకవేళ అదే నిజమైతే రాధతో చండశాసనుడు మూవీలో ఎన్టీఆర్ జతకట్టారు కదా. మరి అదే రాధతో బాలయ్య ఎన్ని సినిమాలు చేయలేదు. 1987లో సాహస సామ్రాట్ అనే మూవీలో శ్రీదేవిని హీరోయిన్ గా అడిగారు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు ఆ సినిమాకు డైరెక్టర్ గా ఉన్నారు. దాంతో శ్రీదేవి ఒకే చెప్పేసింది. బాలయ్య,శ్రీదేవి కాంబోలో మూవీ వస్తోందని అప్పట్లో పేపర్ యాడ్ కూడా వచ్చేసింది.
Tollywood Actress sridevi net worth
అయితే డేట్స్ కుదరక పోవడంతో శ్రీదేవి నటించలేదు. దాంతో ఇగో హర్ట్ అయినప్పటికీ బాలయ్య బయట పడకుండా గుంభనంగా ఉన్నారు. అయితే 1989లో భలే దొంగ మూవీలో కూడా శ్రీదేవిని సంప్రదిస్తే ఆమె బిజీ షెడ్యూల్ వలన ఒప్పుకోలేదు. దాంతో బాలయ్య తీవ్రంగా హర్ట్ అయ్యాడు. ఇక సింగీతం శ్రీనివాసరావు డైరెక్షన్ లో వచ్చిన ఆదిత్య 369మూవీలో శ్రీదేవిని పెడితే, ఈమూవీకి ఇండియా వైడ్ క్రేజ్ వస్తుందని చెప్పారట. కానీ బాలయ్య ససేమిరా ఒప్పుకోలేదట. అప్పుడే తన తండ్రితో నటించిన వాళ్ళతో తాను నటించకూడదని బాలయ్య నిర్ణయించుకున్నట్లు పేపర్స్ లో రూమర్స్ ప్రచారం అయ్యాయి.