Politics

మరొక కీలక నిర్ణయం తీసుకున్న సీఎం జగన్…

రాష్ట్రంలో అధికారాన్ని దక్కించుకున్న వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి, రాష్ట్రాభివృద్ధి విషయంలో ఎక్కడా తగ్గకుండా, రాష్ట్ర ప్రజలందరి కోసం ఆలోచిస్తూ ఇప్పటికే ఎన్నో కీలకమైన నిర్ణయాలని తీసుకున్న సంగతి తెలుసిందే. కాగా సీఎం జగన్ తాజాగా మరొక కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి వ్యవహారాల పై ప్రత్యేకమైన దర్యాప్తు బృందం (సిట్‌)ను ఏర్పాటు చేసింది. కాగా ఇందుకోసమని ప్రత్యేకంగా ఐపీఎస్‌ అధికారి కొల్లి రఘురామ్‌రెడ్డి ఆధ్వర్యంలో 10 మంది సభ్యులతో సిట్‌ను ఏర్పాటు చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

కాగా సీఆర్‌డీఏ పరిధిలోని సరిహద్దుల మార్పు, అవకతవకలు, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌, బినామీ లావాదేవీలపై ఈ బృందం ప్రత్యేకంగా దర్యాప్తు జరపనుంది సమాచారం. ఈ బృందంలోని అధికారులకు, సభ్యులందరికి కూడా ప్రత్యేకమైన అధికారాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టబెట్టింది. అంతేకాకుండా ఈ ప్రత్యేక బృందం లో సభ్యులుగా ఐపీఎస్‌ అధికారులు అట్టాడ బాబూజీ, వెంకట అప్పలనాయుడు, శ్రీనివాస్‌రెడ్డి, జయరామ్‌రాజు, విజయ్‌ భాస్కర్‌, గిరిధర్‌, కెనడీ, శ్రీనివాసన్‌, ఎస్వీ రాజశేఖర్‌రెడ్డిలను నియమించింది.