పూరీ జగన్నాథ్ సంపాదించిన ఆస్తిని ఏమి చేసాడో తెలుసా…సంపాదన ఎంత?
కన్నడ,హిందీ మూవీస్ లో కూడా సత్తా చాటిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ చాలామంది హీరోలకు హిట్స్ ఇచ్చాడు. ఇతడి సినిమాలకు ఇండియా మొత్తం మంచి మార్కెట్ ఉంది. ఇస్మార్ట్ శంకర్ వరకూ హీరోయిజం ఓ రేంజ్ లో చూపిస్తూనే వచ్చాడు. డైనమిక్ డైరెక్టర్ గా పాపులార్టీ సాధించిన పూరి హీరో ఎలివేషన్ లో దిట్ట. స్టైలిష్ మేకింగ్ తో సినిమాలు తీయడంలో పూరి ని మించినవారు లేరని చెప్పాలి.
ఇప్పటివరకూ 34సినిమాలకు డైరెక్షన్ చేసిన పూరి జగన్నాధ్ అరుదైన రికార్డ్ సాధించారు. ఆరు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కొత్తగా, 18సినిమాలతో సూపర్ హిట్ అందుకున్నాడు. 2000సంవత్సరంలో పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమా చేసి,మొదటి సినిమాతోనే మంచి హిట్ కొట్టాడు. అయితే పూరి సినిమాల్లో ఆల్ టైం రికార్డ్ పోకిరి మూవీకి దక్కుతుంది. ప్లాప్ లు వచ్చినా సరే,అభిమానులు తగ్గని స్టార్ డైరెక్టర్ గా పూరికి పేరుంది.
పాపులారిటీ ,స్టార్ డమ్ గల పూరి జగన్నాధ్ ఏడాదికి ఎంత సంపాదిస్తాడు,ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటాడు, టోటల్ నెట్ వర్త్ ఎంత వంటి విషయాల్లోకి వెళ్తే, ఏడాది నెట్ వర్త్ దాదాపు 25కోట్లు. సినిమా డైరెక్షన్ కి ఐదు కోట్లు తీసుకుంటాడు. హైదరాబాద్ లో బిజినెస్ హోటల్స్ కూడా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ లో 10కోట్లు విలువ చేసే ఇల్లు,రెండు అధునాతన కార్లు ఉన్నాయి.
