Movies

మెగాస్టార్ తో ఉన్న ఈ కమెడియన్ ఎవరో తెలుసా…గుర్తు పట్టారా…?

గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగాస్టార్ తో పాటు మరో చిన్న కుర్రాడి ఫోటో వైరల్ అవుతోంది. ఎవరబ్బా అంటూ ఆసక్తికరంగా చర్చ మొదలైంది. తీరా చూస్తే అతడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్. 20 ఏళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే వందల సినిమాల్లో నటించాడు. హీరోగా కూడా సత్తా చూపించాడు. ఇప్పుడు కమెడియన్‌గా రీ ఎంట్రీ ఇవ్వడమే కాకుండా విలన్ అవతారం ఎత్తాడు. ఇక చిన్నప్పటి నుంచి కూడా చిరంజీవి అంటే ప్రాణం.

అప్పట్లోనే చిరంజీవి పాటలకు డాన్సులు వేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. పేరుకు కమెడియన్ అయినా కూడా హీరోకు ఉన్నంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు. అతడెవరో కాదు కమెడియన్ ప్లస్ హీరో సునీల్. చిరంజీవితో కనిపిస్తున్న వ్యక్తి సునీలా అని ఆశ్చర్యపోయేలా ఫోటో ఉంది.

అవును, ఈ భీమవరం బుల్లోడు ఒకప్పుడు అలా ఉండేవాడు. ఎన్నో సినిమాల్లో కామెడీ చేసి, ఈ మధ్యే విలన్‌గా టర్న్ అయ్యాడు. డిస్కో రాజా సినిమాలో విలన్ గా నటించిన సునీల్, ఇప్పుడు కలర్ ఫోటో సినిమాలో కూడా అలాంటి పాత్ర చేస్తున్నాడు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."