Movies

ఈ డైరెక్టర్లకి కోపం వస్తే నిజంగా పగిలిపోవాల్సిందే

కెమెరా మెన్ గా చేసేవాళ్ళలో డైరెక్టర్ ఉంటాడు. అందుకే చాలామంది కెమెరా మేన్స్ డైరెక్టర్స్ అయ్యారు. ఎస్ ఎస్ లాల్ ,ఎస్ . గోపాలరెడ్డి,వి ఎస్ ఆర్ స్వామి,దేవరాజ్,పిసి శ్రీరామ్, బాలూ మహేంద్ర, అశోక్ కుమార్ ఇలా వీళ్లంతా మంచి కెమెరా మెన్లు మాత్రమే కాదు,మంచి డైరెక్టర్స్ కూడా అయ్యారు. అందులో డైరెక్టర్ తేజ ఒకడు. ఎక్కడైనా అతిగా ప్రేమ ఉంటుందో అక్కడే అపార్ధాలు,ఆవేశం,కోపం, ఇగో ఇలా అన్నీ ఉంటాయి. డైరెక్టర్ తేజ కూడా ఇలాంటి వ్యక్తి అని అంటుంటారు. ఇక అప్పట్లో కొత్త డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ దగ్గర చేయడం వలన ఈమాత్రం డైరెక్షన్ మనం చేయలేమా అనిపిస్తుంది. అందుకే చిత్రం మూవీతో డైరెక్టర్ అయ్యాడు. స్త్రీ పురుషుల మధ్య ఏటిట్యూడ్ ఎలా ఉంటుందో ఆవిష్కరించి ఓ ట్రెండ్ క్రియేట్ చేసాడు చిత్రం మూవీతో తేజ.

సున్నితమైన స్త్రీ కోరిక ఎంత బాహాటంగా వ్యక్తపరుస్తుందో చిత్రం మూవీలో తేజ చూపించడం వలన కొంచెం నెగెటివ్ షేడ్ వచ్చింది. ఆ సినిమా యూత్ కి బాగా కనెక్ట్ అయింది. అయితే హీరో హీరోయిన్స్ పై తగిన సీన్స్ రాబట్టడం కోసం తేజ కొట్టిన సందర్భాలున్నాయని అంటారు. పాత డైరెక్టర్స్ కెవి రెడ్డి,విక్టరీ మధుసూదనరావు లాంటి వాళ్ళు కొట్టేవారట.

మధు సూదనరావు తిట్లు హీరోలు భరించలేకపోయేవారట. జేబుదొంగ సినిమాకు శోభన్ బాబుని హీరోగా కన్ఫర్మ్ చేయడానికి వెళ్తే,రెమ్యునరేషన్ తక్కువిచ్చినా పర్వాలేదు గానీ సెట్ లో అందరి ముందు తిడితే మాత్రం ఒప్పుకోనని శోభన్ బాబు కండీషన్ పెట్టాడట . సి. పుల్లయ్య , బి ఏ సుబ్బారావు,అయితే బూతులు కూడా తిట్టేవారట. కోప్పడ్డంలో కె విశ్వనాధ్ కూడా ఉన్నారట. కాఫీ ,టీలు తెస్తే విసిరికొట్టేవారట. రాఘవేంద్రరావు అయితే కళ్లద్దాలు పగుల గొట్టుకునే వాడు. దాసరి నారాయణరావు అయితే క్లాప్ తీసి అసిస్టెంట్ ని కొట్టేసేవాడట. ఇవన్నీ డెడికేషన్ తో వర్క్స్ చేయడం వలన జరిగినవేనని ప్రముఖ విశ్లేషకులు,సినీ జర్నలిస్ట్ ఇమంది రామారావు ఓ ఇంటర్యూలో చెప్పుకొచ్చారు. డైరెక్టర్ తేజ కూడా అంతేనని,నటీనటుల్లో గల టాలెంట్ ని 100శాతం బయట పడేలా చేయడానికి అలా చేసేవారని ఆయన చెప్పారు.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."