Movies

సుకుమార్ గడ్డం సెంటిమెంట్ వెనక ఉన్న కథ ఏమిటో తెలుసా?

సుకుమార్ మాస్ సినిమాలు చేస్తే మేమంతా సర్దుకోవాల్సిందే అని రాజమౌళి సుకుమార్ ని గతంలో ప్రశంసించిన సంగతి తెలిసిందే. అన్నట్లుగానే ఇటీవల రంగస్థలం సినిమాతో మాస్ హిట్ అందుకున్నాడు. తాజాగా అయన అల్లు అర్జున్ తో సినిమా చేయబోతున్నాడు. అయితే సినిమా పరిశ్రమలో సెంటిమెంట్స్ కి, కాంబినేషన్స్ కి ఎక్కువ ప్రధాన్యత ఇస్తారు.

తాజాగా ఆ జాబితాలో చేరిపోయాడు దర్శకుడు సుకుమార్. స్వతహాగా ఎప్పుడు గడ్డం పెంచుకొని ఉండే సుకుమార్… తన సినిమాలో హీరోలకి కూడా గడ్డం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో నాన్నకు ప్రేమతో, రంగస్థలం, సినిమాలలో అయన స్టార్ హీరోలను గుబురు గడ్డంతో చూపించారు. అవి రెండు కూడా మంచి విజయాలు సాధించాయి. ఇప్పుడు అల్లు అర్జున్ తో చేయబోయే సినిమాకు కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు సుకుమార్.

అల్లు అర్జున్ సినిమాలో లారి డ్రైవర్ పాత్రలో నటిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంటే లుక్ ఊర మాస్ గా ఉండాలి. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని గడ్డం పెంచమని చెప్పాడట సుకుమార్. బన్నీ కూడా ఇప్పుడు అదే పనిలో ఉన్నాడట. ఇటీవల వచ్చిన బన్నీ ఫోటోలు కూడా ఆ విషయాన్నీ ధ్రువీకరించాయి. మరి ఈ సినిమాతో సుకుమార్ పరిశ్రమలో ఎటువంటి బ్లాక్ బస్టర్ హిట్ అందిస్తాడో చూడాలి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."